Updated : 25/01/2022 04:36 IST

సమస్య ఏదైనా తేనె ఉందిగా!

పగలిన పెదాలు, కళ్లచుట్టూ నల్లని వలయాలు, యాక్నె... సమస్య ఏదైనా ఇంట్లో కాసింత తేనె ఉంటే చాలు. సమస్యని ఇట్టే పరిష్కరించుకోవచ్చు...

* రాత్రి నిద్రపోయే ముందు యాక్నెపై కాస్త తేనెరాసి ఆపై బ్యాండ్‌ఎయిడ్‌ని అతికించండి. తెల్లారేసరికల్లా తగ్గుముఖం పడుతుంది.

* కొద్దిగా తేనె, దాంతో సమానంగా నెయ్యి కలిపి రాత్రి పడుకోబోయేముందు పగిలిన పెదాలకు పట్టించండి. పొద్దున్నకల్లా పెదాలు మృదువుగా మారతాయి.

* ఆలివ్‌నూనె...కొద్దిగా తేనె కలిపి కళ్లకింద నల్లని వలయాలకి రాసి చూడండి. రెండు రోజులు ఇలా చేస్తే క్రమంగా ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది.

* ముఖం మీద మచ్చలు ఇబ్బందిపెడుతోంటే తేనెకి, అలొవెరా గుజ్జుని కలిపి రాయండి. మార్పు మీకే తెలుస్తుంది.

* బ్లాక్‌హెడ్స్‌తో ఇబ్బంది పడేవారు.... దాల్చిన చెక్కపొడికి సమాన పరిమాణంలో తేనె కలిపి రాస్తే ప్రయోజనం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని