Updated : 27/01/2022 04:54 IST

వెచ్చ వెచ్చగా... బుజ్జాయికి నచ్చగా!

స్నానం చేయించగానే బుజ్జిగాడు చలి చలి అంటూ వణికి పోతాడు... చిట్టితల్లికి లాలపోయగానే మల్లె మొగ్గలా ముడుచుకుపోతుంది. ఈ బంగారు కొండలకు వెచ్చదనం అందించాలంటే నాణ్యమైన తువ్వాళ్లు కావాల్సిందే... అంతేనా అంటే... అంతకు మించి అంటారా... వారి లేలేత చర్మానికి వెచ్చదనాన్నిస్తూ, అదే సమయంలో మృదువుగా అంటిపెట్టుకుని ఉండే తువ్వాళ్లు కావాలి. మన్నికతోపాటు ఆకర్షణీయమైన రంగుల్లో... అందమైన బొమ్మల రూపంలో ఉండేవి బుజ్జాయిలకు భలేగా నచ్చుతాయి. వారిని ఆకట్టుకోవడానికే పిల్లి, కుక్క, చిలుక, బాతు... ఇలా రకరకాల జంతువులు, కార్టూన్‌ల ఆకారంలో మృదువైన తువ్వాళ్లను రూపొందిస్తున్నారు తయారీదారులు. బాగున్నాయి కదూ. మీ పాపాయికీ¨ తెచ్చేయండి మరి.


Advertisement

మరిన్ని