Published : 31/01/2022 01:10 IST

లిప్‌స్టిక్‌ వాడుతున్నారా?

మన భావాలన్నీ మాటల రూపంలో వ్యక్తమయ్యేది పెదాల ద్వారానే. సహజంగానే అందాలు చిందించే పెదాలు లిప్‌స్టిక్‌తో మరింత మెరుస్తాయి. అయితే లిప్‌స్టిక్‌ ఏదో ఒక రంగు వేసుకుంటే లాభంలేదు. ఈ విషయంలో మేకప్‌ నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తŸలివి...

* పెదాలు ఎండిపోయినట్లు, పొరలు ఊడుతున్నట్లు ఉంటే లిప్‌స్టిక్‌ బాగోదు. ముందు ఆ సమస్యను నివారించండి. అందుకోసం రాత్రిపూట పెదాలకు కాస్త వెన్న లేదా పెట్రోలియం జెల్లీ రాస్తే సరిపోతుంది.

* ముందు ఔటర్‌లైన్‌ గీసుకుని, ఆనక లిప్‌స్టిక్‌ వేస్తే బయటకు పాకకుండా ఉంటుంది. లిప్‌బ్రష్‌ సాయంతో మధ్యభాగం నుంచి అంచులకు వేస్తే సరిగ్గా వస్తుంది. లిప్‌స్టిక్‌ పాయింటెడ్‌గా ఉంటే తగినంతే వేయడం సులువవుతుంది. లేదంటే అవసరమైనదానికంటే ఎక్కువగా వచ్చి అలుక్కుపోయినట్లు కనిపిస్తుంది.

* అదనంగా అనిపించినా, ఔటర్‌లైన్‌ దాటినా టిష్యూపేపరుతో జాగ్రత్తగా అద్ది సరిచేయండి. లిప్‌బామ్‌తో పెదాలను మర్దనా చేసి ఆనక లిప్‌స్టిక్‌ వేస్తే ఎక్కువసేపు చెక్కుచెదరకుండా ఉంటుంది. అలాగే రెండు రంగులు ఒక దాని తర్వాత ఒకటి వేసి కూడా అవసరమైన షేడ్‌ వచ్చేలా చేసుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని