Published : 03/02/2022 01:01 IST

సరిగానే తొలగించారా?

రోజూ సంగతి ఎలాగున్నా.. వేడుకల సమయాల్లో చాలామందికి భారీ మేకప్‌ అలవాటుంటుంది. అందంగా కనిపించడంలోనే కాదు.. దాన్ని పూర్తిగా తొలగించడంలోనూ అంతే శ్రద్ధ పెట్టాలి.

చాలామంది మేకప్‌ వైప్స్‌తో తొలగించి, మాయిశ్చరైజర్‌ రాసేస్తారు. కానీ ఇది మంచి చర్య కాదు. కేవలం వైప్స్‌తోనే మేకప్‌ తొలగిపోదు. ఫలితంగా మొటిమలు, ఇన్ఫెక్షన్‌ సమస్యలొస్తాయి. కొన్నిరకాలు కళ్లకు వేసే వాటిపై పనిచేయవు. వాటికే ప్రత్యేకంగా తయారు చేసే రిమూవర్‌లను ఎంచుకోవాలి. అసలే లైనర్‌, మస్కారా వంటివి ఓ పట్టాన వదలవు. కళ్ల సమస్యలొచ్చే ప్రమాదం లేకపోలేదు. వైప్స్‌తో తొలగించాక, ముఖానికి క్లెన్సర్‌ రాసి నిమిషం పాటు వదిలేయండి. ఆపై చేతిని తడిచేసుకుంటూ ముఖమంతా మసాజ్‌ చేస్తున్నట్లుగా రుద్ది, కడిగేయండి.100 శాతం శుభ్రమైంది అనిపించాలంటే.. తర్వాత ఆవిరి పట్టాలి. ముఖంపై రంధ్రాలు తెరుచుకుని, మిగిలిన కొద్దో గొప్పో మేకప్‌ కూడా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మిసెల్లర్‌ వాటర్‌ను దూది మీద కొన్ని చుక్కలు వేసి, దాంతో ముఖమంతా తుడవండి. చర్మానికి తేమ అందుతుంది. చివరగా మాయిశ్చరైజర్‌ రాస్తే సరి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని