Published : 04/02/2022 00:48 IST

మెరిపించే బియ్యం నీళ్లు!

బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారా? వాటిలో బోలెడు పోషకాలుంటాయి. కొరియన్‌ సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఈ నీటిని వాడతారట. చర్మ, కేశ సౌందర్య పోషణకు మనమూ ఈ నీటిని సహజసిద్ధంగా వాడేద్దామా...

రైస్‌క్యూబ్స్‌... బియ్యం కడిగిన నీళ్లను ట్రేల్లో పోసి ఐస్‌క్యూబ్స్‌గా చేయాలి. వీటితో ముఖం రుద్ది ఆరనివ్వాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ లేదా మేకప్‌ వేసుకుంటే సరి. చర్మరంధ్రాలు చిన్నగా అవ్వడంతోపాటు చర్మానికి సహజ మెరుపు అందుతుంది. ఈ నీటిని స్ప్రే సీసాలో పోసి ముఖంపై చల్లుకున్నా ప్రయోజనమే.

కురులకు... ఈ నీటిలో ఇనోసిటోల్‌ అనే పిండిపదార్థం ఉంటుంది. ఇది జుట్టుని బలంగా ఉంచుతుంది. వీటిలోని పోషకాలు మాడు పీహెచ్‌ స్థాయుల్ని సమతుల్యం చేస్తాయి. చుండ్రుని తొలగిస్తాయి. అలాగే కుదుళ్లకు కావాల్సిన తేమను అందించి కురులు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని