Updated : 08/02/2022 04:43 IST

మెరుపునిచ్చే గుమ్మడి

ముఖసౌందర్యానికి వినియోగించే క్రీముల్లో ఎంతోకొంత రసాయనాలుంటాయి. దీంతో చర్మం పలురకాల సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాకాకుండా సహజసిద్ధమైన గుమ్మడి కాయ గుజ్జుతో ఇంట్లో తయారుచేసే క్రీమ్‌ నిత్యం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందంటున్నారు చర్మసౌందర్య నిపుణులు. అదెలాగో చూద్దాం.

గుమ్మడికాయ గుజ్జును మిక్సీలో వేసి మెత్తగా చేసుకుని రసాన్ని వడకట్టాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో పొయ్యిపై ఉంచాలి. అయిదు నిమిషాలు మరిగాక దానిలో రెండు చెంచాల మొక్కజొన్నపొడి వేసి దగ్గరపడే వరకు ఉంచి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత చెంచా చొప్పున కలబంద గుజ్జు, బాదం నూనె వేసి బాగా కలపాలి. ఇలా తయారైన వైట్‌ క్రీమ్‌ను ఓ పొడి గాజుసీసాలో నింపి ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే వారం పదిరోజులు వినియోగించుకోవచ్చు. రోజూ రాత్రి నిద్రపోయే ముందు మేకప్‌ తొలగించి, ముఖాన్ని శుభ్రపరుచుకున్నాక ముఖం, మెడకు ఈ క్రీమ్‌తో అయిదు నిమిషాలు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే చాలు... ముఖవర్చస్సు పెరగడమే కాదు. చర్మం మెరుపులీనుతుంది. మొటిమలు, మచ్చల సమస్యలకూ దూరంగా ఉండొచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని