Updated : 08/02/2022 05:17 IST

చక్కని పెదాలకు.. చిట్టి లిప్‌స్టిక్‌లు

చర్మ సంరక్షణ అయినా, మేకప్‌ అయినా.. పెదాలకీ ప్రాధాన్యమివ్వాల్సిందే. రెండిట్లో ఏదైనా లిప్‌స్టిక్‌, లిప్‌బామ్‌.. వెంట తీసుకెళ్లడమూ తప్పనిసరి. కొన్నిసార్లు తీసుకెళ్లడం ఇబ్బంది అయితే.. ఇంకొన్నిసార్లు మొహమాటం. ఇంకా.. కొత్తగా ప్రయత్నించాలనుకున్నప్పుడు మనకు సరిపడతాయో లేదోనన్న సందేహం. వీటన్నింటికీ పరిష్కారంగా వచ్చినవే ఈ చిట్టి నేస్తాలు. లిప్‌బామ్‌, లిప్‌స్టిక్‌, లిప్‌గ్లాస్‌.. అన్నింటినీ చిన్ని చిన్ని రూపాల్లో అందిస్తున్నారిలా. పెదాలకు అందం.. చూడటానికీ ముచ్చటగా ఉంటాయి. బాగున్నాయి కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని