Updated : 11/02/2022 05:59 IST

చర్మం ముడతలు పడేచోట...

మెడ, నడుము, మోచేతులు, మోకాళ్లు ఇలా చర్మం ముడతలుపడే చోట కొద్దిగా నల్లగా అవుతుంటుంది. కొందరిలో ఎర్రబారి దద్దుర్లు కూడా వస్తాయి. అందవిహీనతనూ, బాధనూ కలిగించే దీని నివారణ మన చేతిలోనే ఉంది.

* మెడ, నడుము, చేతి ముడతల వద్ద కనిపించని దుమ్ము పేరుకుని ఈ సమస్య మొదలవుతుంది. బూట్లు, సాక్స్‌ ధరించడం వల్ల గాలి సోకనందువల్లా దద్దురు వస్తుంది. అధిక బరువు కూడా కారణమే. చర్మం పరిశుభ్రంగా ఉంచుకోవడం, ముడతల్లో తడి లేకుండా చూడటం, తగినంత వ్యాయామం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. చెమటగా అనిపించినప్పుడు స్నానం చేయండి లేదా వెట్‌ టిష్యూ వైప్స్‌తో మెల్లగా తుడవండి.
*  కొన్నిసార్లు మెడ, చేతులు, కాళ్ల ముడతల్లో దురదగా లేదా మంటగా ఉంటుంది. అలాంటప్పుడు రుద్దినా, గోకినా చేస్తే పుండ్లు పడతాయి. బదులుగా టాల్కం పౌడర్‌ లేదా పెట్రోలియం జెల్లీ ఉపయోగించండి. దద్దుర్లు వచ్చిన ప్రదేశంలో హెయిర్‌ డ్రయర్‌ సాయంతో వేడి గాలి ప్రసరింపచేయడం ద్వారానూ ఫలితం ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.
* మోచేతులూ మోకాళ్లకు క్రమం తప్పక  కొబ్బరి నూనె రాసి మర్దనా చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవద్దు. చెమటపట్టే సింథటిక్‌ వస్త్రాలకు బదులు నూలువి ధరిస్తే మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని