Published : 16/02/2022 00:53 IST

జుట్టు తెల్లబడుతోందా..

కాలుష్యం, వాడే ఉత్పత్తుల్లో రసాయనాలు, హెయిర్‌ స్టైలింగ్‌.. వెంట్రుకలు తెల్లబడటానికి ఎన్ని కారణాలో! ముప్పైల్లోనే ఎందరో అమ్మాయిలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి పరిష్కారమేంటి అంటారా?

* మూడు, నాలుగు ఉసిరి కాయల్ని చిన్న ముక్కలుగా కోసి కప్పు నీటిలో వేసి చిన్న మంట మీద మరిగించండి. 5-10 నిమిషాలుంచి దించేయండి. ఆరాక చిన్న స్ప్రే బాటిల్‌లో పోసుకుని ఫ్రిజ్‌లో ఉంచండి. తలస్నానం చేసి, ఆరిన తలకి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే వెంట్రుకలు తెల్లబడటం నెమ్మదిస్తుంది.
* కరివేపాకులో బయోఆక్టివ్‌ మూలకాలుంటాయి. ఇవి కురులు తెల్లబడటాన్ని ఆపడమే కాక, పెరుగుదలకీ సాయపడతాయి. ఆకుల్ని మెత్తగా మిక్సీ పట్టి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సరి. లేదా కప్పు కొబ్బరినూనెకు అంతే పరిమాణంలో ఆకుల్ని వేసి కాగబెట్టి పొడిగా ఉన్న సీసాలోకి తీసుకోవాలి. తలస్నానానికి అరగంట ముందు తలకు పట్టించినా ఫలితముంటుంది.
* గుంటగలగరాకు సహజ డైలా పనిచేస్తుంది. దీనిలోని బయో ఆక్టివ్‌ గుణాలు మెలనిన్‌ను పెంచుతాయి. కప్పు నూనెకు సమాన పరిమాణంలో ఆకులు కలిపి వేడి చేయాలి. దాన్ని వారానికి రెండుసార్లు రాస్తే సరి.
* రెండు కప్పుల నీటిలో ఐదు స్పూన్ల కాఫీ పౌడర్‌ కలిపి వేడిచేయండి. ఆరాక తలకు పట్టించి, అరగంట తర్వాత కడిగిస్తే సరి. వారానికోసారి చేస్తే చాలు.
* బి12, బి7, బి9, డి విటమిన్లు.. గుడ్డు, పాల పదార్థాలు, చేప, పాలకూర, రాజ్మా వంటి వాటిల్లో  ఎక్కువగా లభిస్తాయి. వాటినీ తరచుగా తీసుకోవాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని