Published : 17/02/2022 00:30 IST

ముఖానికి నూనె రాస్తే!

ముఖంపై ఏవైనా సమస్యలొస్తే చాలావరకూ ఏవేవో ఉత్పత్తులు వాడటానికి మొగ్గు చూపిస్తాం. నూనెలు రాయాలంటే ఆలోచించే వారే ఎక్కువ. పైగా ఇవి సమస్యలను మరింత పెద్దవి చేస్తాయనుకుంటాం. అది అపోహే. ఇవి వాటిని దూరం చేయడమే కాదు.. తేమనీ అందిస్తాయి.

ర్మం నుంచి సహజంగానే నూనెలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి, బయటి నుంచి ప్రత్యేకంగా అందించనక్కర్లేదు అనేది చాలామంది భావన. కానీ చర్మం తరచుగా నీటిని కోల్పోతుంటుంది. దీంతో నిర్జీవంగా తయారవుతుంది. నూనెలు ఆ తేమను బంధించి ఉంచడానికి సాయపడతాయి. మొక్కల వివిధ భాగాల నుంచి సహజంగా వస్తాయి, రసాయనాల జోక్యం ఉండదు కాబట్టి, దుష్ప్రభావం పడుతుందన్న భయముండదు. రోజూ రాత్రుళ్లు రాస్తే.. డెర్మటైటిస్‌, ఎగ్జిమా వంటి వాటిని దూరంగానూ ఉంచుతాయి.

కొబ్బరి నూనె: చర్మంలోకి తేలిగ్గా ఇంకిపోతుంది. తేమతోపాటు మెరుపునీ అందిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్‌గానూ పని చేస్తుంది.

షియా బటర్‌.. ఆర్గానిక్‌ రకాన్ని ఆలివ్‌/ కొబ్బరి నూనెలతో కలిపి రాసుకుంటే మంచిది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషకాలను అందిస్తాయి.

బాదం నూనె: చర్మానికి సాయపడే విటమిన్‌ ఇ, జింక్‌, ప్రొటీన్లు, పొటాషియం ఉంటాయి. మెరుపుతోపాటు సాగే గుణాన్నీ అందిస్తుంది.

రోజ్‌హిప్‌ సీడ్‌ ఆయిల్‌: సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది మాయిశ్చరైజర్‌గా పని చేయడంతోపాటు వృద్ధాప్య ఛాయల్ని దరిచేరనివ్వదు.

జొజొబా: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. గాయాల్ని మాన్పడంలో బాగా పనిచేస్తుంది. మొటిమలు, మచ్చలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని