Updated : 26/02/2022 03:18 IST

సన్‌స్క్రీన్‌ ఎంచుకునేదెలా?

అప్పుడే ఎండాకాలం వచ్చేసినట్లు అనిపిస్తోంది కదా! చర్మ సంరక్షణలో ఇప్పటివరకూ సన్‌స్క్రీన్‌ను చేర్చుకోని వాళ్లు ఇక దాని గురించి ఆలోచించాల్సిందే. అలాగే కొనే ముందు ఈ విషయాలనూ గమనించుకోండి. అప్పటికే వాడుతున్న వాళ్లూ వీటిని పరిశీలించుకోవాలి.

ఎంత?.. అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని ఎంతవరకూ రక్షిస్తుందో అంచనా వేసేది ఎస్‌పీఎఫ్‌ ఆధారంగానే. నిపుణుల ప్రకారం కనీసం 30 ఉన్నది వాడాలి. ఇది 93% వరకూ ఈ కిరణాల నుంచి రక్షణనిస్తుంది. ఎక్కువగా ఎండలో తిరిగేవాళ్లు ఎస్‌పీఎఫ్‌ 50 వరకూ ఉన్నది ఎంచుకోవచ్చు. రేడియేషన్‌ నుంచి తప్పించుకోవడమే కాదు.. ఎండకు కమలడం, నల్లబడటం వంటివీ ఉండవు.

ఏమేమున్నాయ్‌?.. తయారీలో టైటానియం డయాక్సైడ్‌, జింక్‌ ఆక్సైడ్‌, అవోబెంజోన్‌ వంటివి ఉంటే మంచిది. విటమిన్‌ ఏ లేకుండానూ చూసుకోవాలి.

ఏ రకం?.. స్ప్రేలు, లోషన్‌, స్టిక్‌ల రూపంలో దొరుకుతున్నాయి. చాలామంది ఎంపిక లోషన్‌. చర్మతీరు ఆధారంగా ఎంచుకునేవారికి ఇది ఉత్తమం. ప్రయాణాలు, తక్కువ సమయం తీసుకోవాలనుకుంటే లోషన్‌, స్టిక్‌లను ఎంచుకుంటే సరి.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని