Published : 02/03/2022 01:17 IST

తారల ట్రెండ్‌..ప్రయత్నిస్తారా?

తారలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు.. చేసేవాటిని అనుసరించే అమ్మాయిలెందరో! మేకప్‌, దుస్తులు, వ్యాయామం, పాటించే నియమాలు.. చెప్పుకొంటూ పోతే జాబితా పెద్దదే. ఈమధ్య మిర్రర్‌ సెల్ఫీ ట్రెండ్‌ తెగ నడుస్తోంది. మన హీరోయిన్లు సమంత, రష్మిక, అనుపమ, రకుల్‌ నుంచి ఆలియా, కత్రినా, అనన్య పాండే వంటి బాలీవుడ్‌ తారల వరకూ అందరూ ఈ ట్రెండ్‌లో పాల్గొంటున్నవారే. మీరూ ప్రయత్నించాలనుకుంటున్నారా? ఈ చిట్కాలతో పాటించేయండి.
బ్యాక్‌గ్రౌండ్‌ చక్కగా కుదిరి, నిలువుటద్దం ఉన్నచోట నిల్చొండి. శరీరమంతా పడే భంగిమలో ఫోన్‌ నుంచి అద్దంలో ప్రతిబింబాన్ని ఫొటో తీస్తే సరి! ఈ విధానంలో మామూలు దానికీ, అద్దంలో ప్రతిబింబానికీ తేడా వస్తుండటమే చాలామంది సమస్య. అప్పుడు.. నచ్చిన భంగిమలో కూర్చొని.. ఫోను చేతిలో పట్టుకొని, ఎదురుగా టైమర్‌తో కెమెరా సెట్‌ చేసుకుని ఉంచుకుంటే సరి.

లేదూ.. మీరు ఫోన్‌ పట్టుకుని అద్దం ముందున్నట్లే నిల్చోడమో, కూర్చోడమో చేయండి. ఎదురుగా మీ స్నేహితురాలిని తన మొబైల్‌/ కెమెరాతో క్లిక్‌ మనిపించేయమనండి. అదే లుక్‌ వచ్చేస్తుంది.
ట్రైపాడ్‌కు ఒక మొబైల్‌ అమర్చుకోండి. ఇంకో మొబైల్‌ను చేత్తో పట్టుకొని మరో చేయి కనిపించని భంగిమలో ప్రయత్నించినా సరిపోతుంది. మోసమే.. కానీ మనకు కావాల్సింది సరైన పోజ్‌లో ఫొటో! నచ్చింది అనిపించాక సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తే సరి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని