Published : 05/03/2022 00:51 IST

చక్కని కురులకు చిట్కాలివిగో...

వెంట్రుకలు రాలడం, చిట్లడం, గడ్డిలా తయారవడం.. ఇవి తరచూ వేధిస్తున్నాయంటే కురులు ఆరోగ్యంగా లేవని అర్థం. ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకోండి..  ఆ సమస్యలుండవు.

* షాంపూని నీటితో కలిపే వాడాలి. ఎప్పుడూ మాడు నుంచి కురుల చివర్ల వైపుకు శుభ్రత సాగాలి. గట్టిగా రుద్దడం లాంటివి చేయొద్దు. తల పొడిబారడమే కాక కుదుళ్లూ బలహీనమవుతాయి. తలస్నానానికి ముందు  ఏదైనా నూనెను రాయండి. ఇది కాలుష్యం, రసాయనాల కారణంగా ఏర్పడే నష్టాన్ని తగ్గిస్తుంది. షాంపూ తర్వాత తప్పక కండిషనర్‌ రాయాలి.

* జుట్టును సహజ పద్ధతుల్లోనే ఆరబెట్టుకోండి. ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి వచ్చే వేడి కురుల్లోని సహజ నూనెలను తొలగిస్తుంది. అత్యవసరమైతే  తప్ప వాటిని వాడకండి. ఆరు వారాలకోసారి చివర్లను కత్తిరించాలి. అప్పుడే కురులు వేగంగా పెరుగుతాయి. పెద్ద పళ్లున్న దువ్వెనలనే వాడాలి. మరీ తడిగా ఉన్నపుడు ఎక్కువగా దువ్వడమూ మంచిది కాదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని