మొటిమలకు ప్యాచ్‌!

యాక్నే, మొటిమలు.. వాటితో ఏర్పడే మచ్చలు అమ్మాయిలకు పెద్ద తలనొప్పి. అవి మొహం మీద కనిపిస్తూ ఉంటే తెలిసో తెలియకో తాకడమో, గిల్లడమో చేస్తుంటారు. అదేమో మరింత పెరిగి, తగ్గడానికి ఇంకొన్ని ఎక్కువ రోజులను తీసుకుంటుంది.

Published : 06 Mar 2022 01:03 IST

యాక్నే, మొటిమలు.. వాటితో ఏర్పడే మచ్చలు అమ్మాయిలకు పెద్ద తలనొప్పి. అవి మొహం మీద కనిపిస్తూ ఉంటే తెలిసో తెలియకో తాకడమో, గిల్లడమో చేస్తుంటారు. అదేమో మరింత పెరిగి, తగ్గడానికి ఇంకొన్ని ఎక్కువ రోజులను తీసుకుంటుంది. మచ్చా త్వరగా వదలదు. కొందరిలో గుంటగానూ ఏర్పడుతుంది. వీటన్నింటి నుంచీ విముక్తి కలిగిస్తుందీ ‘పింపుల్‌ ప్యాచ్‌’. ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని యాక్నే/ మొటిమ ఉన్నచోట ఈ ప్యాచ్‌ను అతికించాలి. అది తెలుపు రంగులోకి మారిన తర్వాత దాన్ని తొలగిస్తే సరి. పెద్దగా అవడాన్ని నిరోధించడంతోపాటు చీమునీ తీసేస్తుందట. మచ్చ పడకుండానే త్వరగా మానేలానూ చేస్తుందట. ప్రయత్నించి చూడండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని