Updated : 06/04/2022 01:27 IST

కళ్లజోడుకి కొత్త హంగులు

వయసుతో సంబంధం లేకుండా కళ్లజోళ్లు ప్రతి ఒక్కరికీ వచ్చేస్తున్నాయి. కానీ వీటిని పెట్టుకోవడం అందానికి అడ్డు అనేది మన భావన. మరేం చేద్దాం? ఈ జ్యువెల్స్‌ను తెచ్చుకుంటే సరి! కళ్లజోళ్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేశారు వీటిని. పూల నుంచి చిన్న చిన్న రాళ్లు, పూసలు, హ్యాంగింగ్స్‌.. ఇంకా భిన్న ఆకారాల్లో వచ్చేస్తున్నాయి. వాటిని అతికించుకుంటే సరి! జోడుకే కాదు.. ముఖానికీ అందాన్ని తెచ్చిపెడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని