Published : 17/04/2022 02:49 IST

ఒక్క తీగతో మెరిసిపోవచ్చిలా!

పెళ్లిలో ఎలాగూ పూల జడ తప్పదు. అది మోసే సరికే మెడ పట్టేస్తుంటుంది. నిశ్చితార్థం, మెహందీ, పెళ్లికూతుర్ని చేయడం, సంగీత్‌.. ఇలా ఎన్నో వేడుకలు జోడవుతూ వెళుతున్నాయి. ఇక వీటన్నింటికీ పూలను చుడుతూ వెళితే పెళ్లికూతురు అలసిపోదు? పైగా ఈ తరం అమ్మాయిలు ప్రతిదానిలోనూ ప్రత్యేకత కావాలంటారు, ఆధునికంగా ఉండాలంటారు. అలాంటి వాళ్లకోసమే వచ్చాయీ ఫ్లోరల్‌ వైన్‌ యాక్సెసరీస్‌.  తీగలాంటి దానికి ముత్యాలు, పూసలు, రాళ్లు, పూలు, ఆకుల్ని అద్ది తీర్చిదిద్దారిలా. చీర, లంగాఓణీ, లెహెంగా, లాంగ్‌ ఫ్రాక్‌.. దేనికైనా ఇట్టే సరిపోతుందీ తీగలాంటి అమరిక.  పెట్టుకోవడమూ సులువు, చిన్న జుట్టుకీ చక్కగా అమరిపోతుంది. అందమూ, సంప్రదాయమూ ఇంకా ఫ్యాషన్‌ బాగుంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని