జీన్స్ వేస్తున్నారా?
మధుమిత ఏ సీజన్‌లోనైనా జీన్స్ ధరించడం మానదు. వారానికి నాలుగైదు రోజులు డెనిమ్ దగ్గరకు వెళ్లందే ఉండలేదు. ఇటువంటి డెనిమ్ గర్ల్స్ కోసం కొన్ని చిట్కాలు చెబుతున్నారు నిపుణులు
మధుమిత ఏ సీజన్‌లోనైనా జీన్స్ ధరించడం మానదు. వారానికి నాలుగైదు రోజులు డెనిమ్ దగ్గరకు వెళ్లందే ఉండలేదు. ఇటువంటి డెనిమ్ గర్ల్స్ కోసం కొన్ని చిట్కాలు చెబుతున్నారు నిపుణులు. జీన్స్ ధరించినప్పుడల్లా కొత్తగా కనిపించేదెలాగో వివరిస్తున్నారు.
యాక్ససరీస్... జీన్స్‌తో జత కట్టే అవుట్‌ఫిట్‌కు యాక్ససరీస్ మ్యాచింగ్ కుదరాలి. అప్పుడే అన్నీ కలిపి ప్రత్యేకంగా కనిపిస్తాయి. స్టైలిష్ బ్యాగు, నడుముకు మ్యాచింగ్ బెల్ట్, సన్‌గ్లాసెస్, చెవులకు, చేతులకు ధరించే సింపుల్ సిల్వర్ జ్యువలరీ ఈ తరహా దుస్తులకు ఇట్టే నప్పుతాయి. మీ జీన్స్‌కు క్యాజువల్ లుక్ వచ్చేసినట్లే. బ్రాండెడ్ జీన్స్‌పై తెలుపు లేదా లేతవర్ణం టాప్, దీనిపై బటన్స్ పెట్టకుండా వదులుగా వదిలేసే ప్రింటెడ్ సమ్మర్ షర్ట్ ధరించాలి. మెడలో సిల్వర్ లాకెట్ ఉన్న సన్నటి గొలుసు, టోట్ బ్యాగుతోపాటు సన్‌గ్లాసెస్ వేసుకొని చూడండి. దాంతోపాటు మీ షూస్ ముదురు వర్ణంలో ఉన్నా ఫరవాలేదు. మీకు గ్రాండ్ లుక్ వచ్చేసినట్లే.
పాదరక్షల ఎంపికలో.. జీన్స్ ధరించేటప్పుడు పాదరక్షలు సాదాగా ఉన్నట్లే కనిపిస్తూ మిమ్మల్ని ప్రత్యేకంగా నిలపాలి. సందర్భానికి తగినట్లుగా బూట్ల ఎంపిక ఉండాలి. క్యాజువల్ లుక్ కనిపించాలంటే రెగ్యులర్ ఫిట్ జీన్స్‌తో లోఫర్స్ లేదా స్నీకర్స్ ఎంపిక బాగుంటుంది. ఇండో వెస్ట్రన్ లుక్ కోసం స్కిన్నీ బ్రాండెడ్ జీన్స్, ఖోలాపురీస్ నప్పుతాయి. ఆఫీస్‌కైతే స్లిమ్-ఫిట్ జీన్స్, బ్లాక్ మ్యూల్స్ సరిపోతాయి. సాయంకాలం పార్టీకి బూట్‌కట్ లేదా స్కిన్నీ బ్రాండెడ్ జీన్‌తో హీల్స్ అదిరిపోతాయి. నలుపు వర్ణం ఇష్టమైన వారికి బ్లాక్ జీన్స్‌పై గులాబీ లేదా లేత ఆకుపచ్చని వర్ణం టాప్ ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. కొందరికి టైట్ జీన్స్ వేసుకోవడం ఇష్టం. ఇటువంటివారు ట్రెండీగా కనిపించాలంటే దీనిపై వదులైన టాప్ వేసుకోవాలి. నాజూకుగా ఉండాలంటే మాత్రం బిగుతైన టాప్‌ను మ్యాచింగ్ చేసుకుంటే చాలు. వీటిపై టైట్ బూట్లు సరిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.