మ్యాజిక్ చేసే మసాలా ఆకు నూనె..
వంటకు రుచినిచ్చే బిర్యానీ ఆకుల్లోని పోషకాలు ఆరోగ్యానికే కాదు, వృద్ధాప్య ఛాయల్ని దూరంగానూ ఉంచుతా యంటున్నారు. ముఖంపై ముడతలు, మచ్చలు రాకుండా కాపాడతాయంటున్నారు నిపుణులు. శిరోజాలు రాలడాన్ని దూరం చేసే మ్యాజిక్ గుణం ఇందులో ఉందంటున్నారు.
వంటకు రుచినిచ్చే బిర్యానీ ఆకుల్లోని పోషకాలు ఆరోగ్యానికే కాదు, వృద్ధాప్య ఛాయల్ని దూరంగానూ ఉంచుతా యంటున్నారు. ముఖంపై ముడతలు, మచ్చలు రాకుండా కాపాడతాయంటున్నారు నిపుణులు. శిరోజాలు రాలడాన్ని దూరం చేసే మ్యాజిక్ గుణం ఇందులో ఉందంటున్నారు.
చర్మానికి సాగే గుణాన్ని అందించే కొల్లాజెన్ ఉత్పత్తికి బిర్యానీ ఆకు తోడ్పడుతుంది. ఇంట్లోనే తయారు చేసే ఈ ఆకుల నూనె చర్మాన్ని మెరిపిస్తుంది. ముందుగా 10 బిర్యానీ ఆకులు, 10 అనాస పూలను విడివిడిగా మిక్సీలో పొడిగా చేసుకోవాలి. ఓ గిన్నెలో అరకప్పు ఆలివ్‌నూనె వేసి, ఇందులో చెంచా చొప్పున బిర్యానీ ఆకులు, అనాస పూల పొడిని వేసి బాగా కలపాలి. దీన్ని నీళ్లు పోసిన పాన్‌లో సగం మునిగేలా ఉంచి పొయ్యిపై పది నిమిషాలు మరిగించి చల్లార్చి వడకట్టాలి. ఇందులో చెంచా చొప్పున విటమిన్ ఈ ఆయిల్, బాదంనూనె వేసి బాగా కలపాలి. ఈ నూనెను పొడిగా ఉండే సీసాలో నింపి గది వాతావరణంలోనే నెలరోజులు నిల్వ ఉంచు కోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు ముఖాన్ని మురికి లేకుండా శుభ్రపరిచి నాలుగైదు చుక్కల నూనెను అప్లై చేసి మృదువుగా మర్దనా చేస్తే చాలు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై పిగ్మెంటేషన్ మచ్చలు, గీతలను దూరం చేస్తాయి. చర్మానికి సాగే గుణాన్నిచ్చి పొడిబారడాన్ని తగ్గిస్తాయి. అలాగే మెడ, చేతులకు రెండుమూడు నిమిషాలు ఈ నూనెతో మర్దనా చేసి ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం మృదువుగా మారి కాంతులీనుతుంది.
శిరోజాలకు..
ఓ గిన్నెలో కప్పు నీటిని తీసుకొని అందులో 10 బిర్యానీ ఆకులను వేసి పది నిమిషాలు మరిగించి చల్లార్చాలి. తలకు షాంపు చేసిన తర్వాత ఈ నీటిని కండిషనర్‌గా ఉపయోగిస్తే జుట్టు మృదువుగా మారి మెరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న బిర్యానీ ఆకుల పొడికి సరిపోయేలా కొబ్బరినూనె లేదా బాదం నూనె కలిపి మాడుకు మర్దనా చేసి ఆరనిచ్చి తలస్నానం చేస్తే చాలు. చుండ్రు సమస్య దూరమై, మాడు ఆరోగ్యంగా మారుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!