సన్నజాజి మొగ్గల్లా...
ప్రతి ఆడపిల్లకీ సన్నజాజిమొగ్గలా, మెరుపు తీగలా ఉండాలనుంటుంది. కాస్త బరువు పెరిగినా డీలా పడి ఆకలేస్తోన్నా, నీరసం ముంచుకొస్తున్నా తినడానికి భయపడటం చూస్తుంటాం. కానీ అందువల్ల అనేక అనారోగ్యాలు వచ్చిపడతాయంటున్నారు వైద్య నిపుణులు.
ప్రతి ఆడపిల్లకీ సన్నజాజిమొగ్గలా, మెరుపు తీగలా ఉండాలనుంటుంది. కాస్త బరువు పెరిగినా డీలా పడి ఆకలేస్తోన్నా, నీరసం ముంచుకొస్తున్నా తినడానికి భయపడటం చూస్తుంటాం. కానీ అందువల్ల అనేక అనారోగ్యాలు వచ్చిపడతాయంటున్నారు వైద్య నిపుణులు. అందుకే సన్నబడాలని ఉంటే ఎంత మాత్రం హాని చేయని ఈ చిట్కాలు పాటించండి...
* పరగడపున రెండు గ్లాసుల నీళ్లు తాగండి. అది శరీరానికి మేలు చేయడంతోబాటు ఊబకాయం రాకుండానూ కాపాడుతుంది. అన్ని నీళ్లు తాగలేమంటారా.. పొద్దున్నే గోరు వెచ్చటి నీటిలో అరచెక్క నిమ్మకాయ పిండి, ఒక చెంచా తేనె వేసుకుని తాగండి. అప్పుడిక లావు పెరుగుతామన్న ఆందోళనే ఉండదు.
* వంటింటి దినుసుల్లో కొన్ని దివ్య ఔషధాలున్నాయి. వాము, జీలకర్ర, మెంతుల పొడి గ్లాసుడు నీళ్లలో వేసుకుని తాగినా ప్రయోజనం ఉంటుంది. రోజూ అప్పటికప్పుడు నూరాలంటే కష్టం కనుక మూడింటినీ విడివిడిగా వేయించి పొడి చేసుకుని తడిలేని సీసాలో ఉంచితే రోజూ వాడుకోవచ్చు. తడి చెయ్యి పెడితే మాత్రం బూజుపడుతుంది.
* వెల్లుల్లి లేని ఇల్లు ఉండదు కదా! రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగినా లావు పెరగరు. పచ్చి వెల్లుల్లి కొంచెం ఘాటుగా ఉండే మాట నిజమే కానీ దీని లాభాల ముందు ఆ కాస్త ఘాటును భరించవచ్చు. ఇది ఊబకాయాన్ని నిరోధిస్తుంది. తరచూ జలుబుతో బాధపడేవారికిది దివ్యౌషధం.
* మనం తినే అనేక పండ్లు, కూరగాయల్లో తీయదనం ఉంటుంది. ఆ సహజ మాధుర్యం వల్ల హాని ఉండదు. కానీ పంచదార వేసిన స్వీట్లతోనే అసలైన చేటు. కనుక వాటికి దూరంగా ఉంటే ఒళ్లు రాదు. అలాగే నూనె పదార్థాలూ వీలైనంత తగ్గించండి.
* రోజులో ఎనిమిది గ్లాసులకు తక్కువ కాకుండా నీళ్లు తాగండి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే చెడు తేలిగ్గా బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల ఊబకాయం రాదు.
* ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం కంటే కొద్దికొద్దిగా చొప్పున ఎక్కువసార్లు తినమంటున్నారు వైద్యులు. తినడానికి పెద్ద పళ్లేలకు బదులు చిన్నవాటిని ఎంచుకోమంటున్నారు అనుభవజ్ఞులు. వినడానికి సిల్లీగా అనిపించినా ఇందులో సైకాలజీ దాగి ఉంది. చిన్నదాంట్లో కొద్ది పరిమాణం కూడా ఎక్కువగా, పెద్దదాంట్లో తక్కువగా కనిపిస్తుంది.
* వేయించిన వాటి కంటే ఉడికించినవి, వాటి కంటే నానబెట్టినవి శ్రేష్టం. కనుక పెసలు, పల్లీలు లాంటివి ఉడికించి లేదా నానబెట్టి తినండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!