ఎండకి.. టమాటా టోనర్!
కాలు బయట పెడితే ట్యాన్.. పోనీ ఇంట్లో ఉన్నా చెమట, జిడ్డు, దాని కారణంగా వచ్చే దద్దుర్లు. ఒక్కోదానికి ఒక్కోటి ఎన్నని వాడతాం? ఒక్క టమాటా తెచ్చేసుకోండి. దీనిలోని న్యూట్రియంట్లు, పొటాషియం, విటమిన్ సి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేస్తాయి.
కాలు బయట పెడితే ట్యాన్.. పోనీ ఇంట్లో ఉన్నా చెమట, జిడ్డు, దాని కారణంగా వచ్చే దద్దుర్లు. ఒక్కోదానికి ఒక్కోటి ఎన్నని వాడతాం? ఒక్క టమాటా తెచ్చేసుకోండి. దీనిలోని న్యూట్రియంట్లు, పొటాషియం, విటమిన్ సి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేస్తాయి.
* జిడ్డు మరీ ఇబ్బంది పెడుతోంటే పచ్చి టమాటా రసాన్ని ముఖానికి పట్టించి, ఆరాక కడిగేయండి. దీంతో చిన్న చిన్న దద్దుర్లు, బ్లాక్ హెడ్స్ వంటివీ తగ్గుముఖం పడతాయి. టమాట రసం, మజ్జిగ సమపాళ్లలో తీసుకొని పూతగా వేయండి. వేడి కారణంగా ఎర్రబడటం, దద్దుర్లు వంటివి తగ్గుతాయి.
* ఎండకి చర్మం కమిలి, నల్లబడినట్లుగా అవుతోంటే.. ఒక టమాట గుజ్జుగా చేసి, రెండు స్పూన్ల ముల్తానీ మట్టి, టేబుల్ స్పూను పుదీనా ఆకుల పేస్ట్ కలిపి ఆయా ప్రదేశాల్లో రాయండి. ఆరిన తర్వాత కడిగేస్తే చాలు. నలుపు తగ్గడమే కాదు.. చర్మం కూడా బిగుతుగా మారుతుంది. ఎండకీ చర్మం పొడిబారుతుంది. ఎండిపోయినట్లుగా అనిపిస్తే.. చిన్న టమాట ముక్కను తీసుకొని పైచర్మం ఊడి వచ్చేంత వరకూ ముఖానికి రుద్ది, ఆరనిచ్చి కడిగేయండి. సమస్య తీరుతుంది.
* చర్మంలో లోతైన మురికి పోవాలన్నా.. మృదువుగా, తేమగా తయారవ్వాలన్నా టోనర్ తప్పనిసరి. ఒక టమాట, కీరా రసాల్ని తీసి వడపోసి స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిజ్లో పెట్టండి. బయటకు వెళ్లేప్పుడు దాన్ని ముఖం మీద చల్లుకుని, మాయిశ్చరైజర్ రాస్తే సరి. ముఖం యవ్వనంగానూ ఉంటుంది. ఈ మిశ్రమం నాలుగు రోజులపాటు పనికొస్తుంది.
* రెండు టమాటాలు, గుప్పెడు పుదీనా, రెండు ఐసు ముక్కలు మిక్సీ పట్టి, దానికి 5 టేబుల్ స్పూన్ల చక్కెర కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్లకు పట్టించి, ఆరాక కడిగేయండి. చర్మం లోతుగా శుభ్రమవడమే కాదు.. కావాల్సిన పోషణా అందుతుంది. వారానికోసారి ప్రయత్నిస్తే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!