లేడీ లాయర్లకు లేటెస్ట్ డిజైన్లు!
లాయర్లనగానే ఏం గుర్తొస్తుంది? తెల్లటి దుస్తులపై నల్లకోటు కదా! దశాబ్దాలుగా ఒకటే యూనిఫాం. వీటికి కొత్త హంగులు అద్దుదామనుకున్నారో డిజైనర్. అందుకే వాళ్లకోసం ప్రత్యేకంగా నలుపు, తెలుపు, ఊదా వర్ణాల్లో చీరలను రూపొందించారు.
లాయర్లనగానే ఏం గుర్తొస్తుంది? తెల్లటి దుస్తులపై నల్లకోటు కదా! దశాబ్దాలుగా ఒకటే యూనిఫాం. వీటికి కొత్త హంగులు అద్దుదామనుకున్నారో డిజైనర్. అందుకే వాళ్లకోసం ప్రత్యేకంగా నలుపు, తెలుపు, ఊదా వర్ణాల్లో చీరలను రూపొందించారు. ఆ సంగతులేంటో మీరూ చదివేయండి.
డాక్టర్లు, పరిశోధనలు చేసేవారు, కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఒక డ్రెస్ కోడ్ ఉంది. కానీ వాటికింద వేసుకునే దుస్తుల్లో ఎన్ని మార్పులైనా చేసుకోవచ్చు. లాయర్ల దగ్గరికొచ్చేసరికి నల్లకోటుతోపాటు దాని కింద తెలుపు, నలుపు, గోధుమ రంగు దుస్తులనే ధరించాలి. దశాబ్దాలుగా ఇదే తీరు. దానిలో కొంత మార్పు తీసుకొద్దామనుకున్నారు సేవ్ ద లూమ్స్ వ్యవస్థాపకుడు రమేషన్ మేనన్. మహిళా లాయర్ల కోసం ప్రత్యేకంగా చీరలను డిజైన్ చేశారు. వాటిని ‘విధి’ పేరిట మార్కెట్లోకి తెచ్చారు. ఈ ఆలోచన ఎందుకొచ్చిందంటే.. మహిళా లాయర్లు కట్టుకునే చీర అన్ని కాలాలకూ తగినట్లుగా ఉండకపోవడం ఆయన గమనించారట. ముఖ్యంగా వేసవిలో ఏసీ సదుపాయం లేని కోర్టుల్లో వారికి మరీ ఇబ్బందిగా ఉంటోందట. అందుకు పరిష్కారం చూపడానికే కాకుండా వారిలో ‘ఇదో యూనిఫాం’ అన్న భావనను పోగొట్టాలన్న ఉద్దేశంతో వీటిని రూపొందించానంటారాయన.
ఇందుకోసం ‘కసువు’ అనే ప్రత్యేకమైన చేనేత వస్త్రాన్ని ఉపయోగించారు. అంటే జరీ అని అర్థమట. ఇది అక్కడి సంప్రదాయ వస్త్రం కూడా. కానీ కాస్త బరువుతో కూడుకుని ఉంటుంది. యువతకు నచ్చేలా దాని తయారీలో కొన్ని మార్పులు చేసి, తక్కువ బరువుతో, సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దారట. అంతేకాదు మన వేడి వాతావరణానికి తగ్గట్టుగా రూపొందించారట. ఇందుకోసం మొగల్ రాజుల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే ముష్రూ సిల్క్‌ను ఆధారంగా తీసుకున్నారు. వీటిలో అడుగు భాగాన ఉండే కాటన్ త్వరగా చెమటను పీల్చుకుంటుంది. బయటివైపు ఉండే వస్త్రం భారీతనాన్ని అందిస్తుంది. ఈ విధానాన్నే ఈ చీరలకూ ఉపయోగించారు. వీటిని హాఫ్ అండ్ హాఫ్ శారీ విధానంలో తయారు చేశారు. అంతేకాదు.. పని ప్రదేశం నుంచి నేరుగా స్నేహితులు, పార్టీలకు వెళ్లాలన్నా తిప్పి కట్టుకుంటే రూపు మారిపోయేలా తీర్చిదిద్దారు. కోటు వేసుకున్నపుడు హుందాగా, తీసేసినపుడు యూనిఫాంలా కాకుండా రోజువారీ కట్టుకునే వాటిలా ఉండేలా డిజైన్ చేశారు. ఇందుకోసం వివిధ న్యాయ విభాగాల వారి సలహాలు, సూచనలూ తీసుకున్నారు.
దేశంలో మొదటి మహిళా అడ్వకేట్ జస్టిస్ అన్నా చాందీ జయంతికి వీటిని మార్కెట్లోకి తెచ్చారు. మొత్తంగా 11 డిజైన్లున్నాయి. దేశవ్యాప్తంగా న్యాయ విభాగంలో పేరు ప్రఖ్యాతులు సాధించిన మహిళల పేరు మీదుగా వీటిని తయారు చేశారు. ప్రతి చీరకీ చేతితో రాసిన ట్యాగ్‌ను జత చేస్తారు. నేసిన వారితోపాటు, దాని మూలానికి సంబంధించిన వివరాలను దానిలో చేరుస్తారు. ఈ చీరల వెనుక మరో ఉద్దేశమూ ఉంది. చేనేతకు ప్రాచుర్యం కల్పించడం. ఒక్కో చీరకు 15 మంది పనిచేస్తున్నారు. అలా వారికి ఆదరణ, ఉపాధి రెండింటినీ కల్పిస్తున్నారు. మంచి ఆలోచనే కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!