నగలు నప్పితేనే హుందా
ఎక్కడికైనా వెళ్లేటప్పుడు సందర్భానికి తగినట్లు దుస్తుల ఎంపిక ఉంటుంది. మేకప్ అంతా పూర్తయిన తర్వాత చివరిగా ధరించే నగల విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించాలంటున్నారు నగల డిజైనర్లు. అవుట్‌ఫిట్‌కు తగిన నగ
ఎక్కడికైనా వెళ్లేటప్పుడు సందర్భానికి తగినట్లు దుస్తుల ఎంపిక ఉంటుంది. మేకప్ అంతా పూర్తయిన తర్వాత చివరిగా ధరించే నగల విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించాలంటున్నారు నగల డిజైనర్లు. అవుట్‌ఫిట్‌కు తగిన నగ ముఖానికి మరింత అందాన్ని, హుందాతనాన్ని తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.
హూప్స్ ..
కాలేజీ లేదా ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు ధరించే క్యాజువల్ దుస్తులపై రెండుమూడు ముత్యాలుండేలా లేదా గోల్డ్ హూప్స్లాంటివి మ్యాచ్ అవుతాయి. గోల్డ్ డాంగ్లెర్స్ కూడా సాధారణ దుస్తులకు నప్పుతాయి. సింపుల్ లుక్ కావాలంటే సోలిటెయిర్స్ను ఎంపిక చేసుకోవాలి. స్టడ్స్లా ఉండే వీటిలో ఒక ముత్యం లేదా రాళ్లు పొదిగి ఉంటే చాలు. ముఖాన్ని సింపుల్‌గా కనిపించేలా చేస్తాయి. వీటికి చిన్న హ్యాంగింగ్ జత అయినా ముఖానికి నప్పుతుంది. అవుట్‌ఫిట్‌కు యునిక్ లుక్‌ను అందిస్తుంది. ఇందులో రంగురాళ్లుంటే ఫ్యాషన్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. అలాగే జామెట్రీ బ్రాస్ ఇయర్ రింగ్స్ చుడీదార్ లేదా జీన్స్, షర్ట్ కాంబినేషన్‌కు సరైన ఎంపిక.
స్టేట్మెంట్ జుయెలరీ..
శుభకార్యాలు, పండుగల్లో ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారికి ఈ స్టేట్మెంట్ జుయెలరీ అలంకరణ మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. దుస్తులకు సరిపోయేలా వీటిని ఎంచుకోవాలి. ఫ్లోరల్ ఇయర్రింగ్స్, గోల్డ్ చెయిన్ చోకర్స్ వంటివి సంప్రదాయ వస్త్రాలకు సరిగ్గా సరిపోతాయి. వీటిని పండుగలకు ధరిస్తే సందర్భానికి సరైన ఎంపిక. ముదురు వర్ణం పట్టు, ఫ్యాన్సీ చీరలపై హెవీ బీడెడ్ కుందన్ నెక్లెస్‌లు నప్పుతాయి. మ్యాచింగ్‌గా కశ్మీరీ జుమ్కీలు రెండు వరుసలుగా భుజాల వరకు జాలువారేలా ఉంటే చాలు. నిండుదనాన్నిస్తాయి. అలాగే నాలుగైదు వరుసల ముత్యాల గొలుసుకు రాళ్లుపొదిగిన పెండెంట్ జత సాయంకాలపు పార్టీలకు సింపుల్‌గా బోర్డరుతో ఉండే పట్టు, జరీ, కాటన్ చీరలపై అందంగా అమరిపోతుంది. షాండ్లియర్ ఇయర్రింగ్స్ మాత్రం కాస్తంత పెద్దగా ఎంపిక చేసుకున్నప్పుడు మెడలో తేలికైన నగ లేదా అసలు ఏమీ పెట్టుకోకపోయినా సింపుల్‌గా, హుందాగా కనిపిస్తుంది. అలాగే దుస్తులకు మ్యాచింగ్‌గా పూర్తిగా సిల్వర్ జుయెలరీ కూడా హుందాతనాన్ని అందిస్తుంది.
సమన్వయంగా..
దుస్తులను ఆభరణాలు సమన్వయం చేయాలి. హెవీ జుయెలరీ ధరించినప్పుడు దుస్తులు కూడా హెవీగా కనిపించేలా ఎంపిక చేసుకోవాలి. అలాగే డైమండ్ జుయెలరీతో బంగారు ఆభరణాలను కలపకూడదు. ఇలా చేస్తే డైమండ్స్ అందం తగ్గుతుంది. ప్రస్తుతం డైమండ్స్ పొదిగి తక్కువ బంగారంతో వస్తున్న నెక్ల్లెస్లు సింపుల్‌గా ఏ దుస్తులకైనా నప్పుతాయి. వీటిపై స్టడ్ ఇయర్ రింగ్స్ క్లాసిక్ లుక్‌ను తేవడమే కాదు, మెడ చుట్టూ మెరిసే డైమండ్స్‌తో కలిసి ముఖానికి కొత్త మెరుపును తెచ్చిపెడతాయి. చోకర్, నవరత్నాలు పొదిగిన హారాలు ఏ సందర్భానికైనా, అలాగే రిచ్ లుక్‌తో ఉండే దుస్తులపైకి నప్పుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!