నెయిల్ పాలిష్.. ఇలా కూడా!
ముస్తాబు అంటే మనకు గోళ్లను అలంకరించుకోవడం కూడా. అందుకు మనం ఉపయోగించేది నెయిల్ పాలిష్‌నే! దీన్ని ఇంకొన్ని విధాలుగానూ వాడొచ్చని తెలుసా?
ముస్తాబు అంటే మనకు గోళ్లను అలంకరించుకోవడం కూడా. అందుకు మనం ఉపయోగించేది నెయిల్ పాలిష్‌నే! దీన్ని ఇంకొన్ని విధాలుగానూ వాడొచ్చని తెలుసా?
* దుస్తులకు తగ్గ నగలు వేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. కానీ అన్నిసార్లూ బంగారమే బాగోదు. ఫ్యాన్సీవే నప్పుతాయి. అయితే కొందరికి చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. మెటల్ వాటితో అలర్జీ వస్తుంది. దీంతో ఎంత నచ్చినా దూరంగా ఉంచుతారు. మీదీ అదే కోవా? నగ వెనక నెయిల్ పాలిష్‌తో కోట్ వేసెయ్యండి. అలర్జీల సమస్య ఉండదు. బయటికి కనపడుతోంటే లేత వర్ణాలు, కనిపించకపోతే ముదురు వర్ణాలు వేసుకోవచ్చు.
* ఒంటిపై చిన్నగా కోసుకుపోవడం, గీరుకుపోవడం, చీమలు, కీటకాలు కుట్టిన దద్దుర్లు.. సహజమే. బ్యాండ్ఎయిడ్ వేసేంత పెద్దవి కావు. కొన్నిసార్లు వేద్దామన్నా దగ్గర ఉండకపోవచ్చు. వాటిని దురద, దుమ్మూ ధూళి నుంచి రక్షించుకోవాలంటే వాటిపై నెయిల్ పాలిష్ పూయండి. పనిచేస్తుంది.
* ఫ్యాన్సీ సాక్సులు, నెటెడ్ చున్నీలు లాంటివి కొన్ని పోగులు ఊడిపోతుంటాయి. ఇది ఒకసారి మొదలైతే ఆపడం కష్టం. అందుకే గుర్తించినపుడే పోగులు ఊడుతున్న చోట నెయిల్ పాలిష్ రాయండి.. సమస్యకు కళ్లెం వేసినట్లే.
* షూ త్వరగా బోర్ కొట్టేస్తున్నాయా? మీ సృజనాత్మకతకు పనిచెప్పేయండి. నెయిల్ పాలిష్‌తో నచ్చిన రంగులను అద్దేయండి. కాంట్రాస్ట్ రంగులతో డిజైన్లు చిన్న చిన్న చుక్కలు పెట్టేస్తే సరి. నయా లుక్ వచ్చేస్తుంది.
* వంటగదిలో డబ్బాలకి గుర్తు కోసమని స్టిక్కర్లు అతికిస్తుంటాం కదా! అవేమో కడగగానే చినిగిపోతుంటాయి. నెయిల్ పాలిష్‌లతో రాసి చూడండి. తడిసినా పోవు. తర్వాత నచ్చక తొలగించాలన్నా సులువే. పైగా కాస్త డిజైన్‌నీ జోడిస్తే కిచెన్‌కీ కొత్త అందం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!