చెమట వాసన పోగొట్టేద్దామా!
కొందరిలో చెమట, దాంతోపాటు వచ్చే దుర్గంధం. ఎన్ని పెర్ఫ్యూమ్లు, డియోలు వాడినా దాయడం కష్టమే. పైగా వాటిలో ఉండే రసాయనాల కారణంగా కొన్నిసార్లు అలర్జీలు. అవన్నీ ఎందుకు... ఈ సహజ చిట్కాలు పాటించేయండి.
కొందరిలో చెమట, దాంతోపాటు వచ్చే దుర్గంధం. ఎన్ని పెర్ఫ్యూమ్లు, డియోలు వాడినా దాయడం కష్టమే. పైగా వాటిలో ఉండే రసాయనాల కారణంగా కొన్నిసార్లు అలర్జీలు. అవన్నీ ఎందుకు... ఈ సహజ చిట్కాలు పాటించేయండి.
* స్నానం నీటిలో లావెండర్, రోజ్మెరీ, టీట్రీ ఆయిల్.. ఇలా నచ్చినదాన్ని ఎంచుకొని కొన్ని చుక్కలు వేయండి. ఇవి చాలావరకూ దుర్వాసనల్ని దూరం చేస్తాయి. రోజుకు కనీసం రెండు సార్లు.. అదీ గోరువెచ్చని లేదా చన్నీటి స్నానం మంచిది.
* చాలావరకూ చర్మంపై సూక్ష్మక్రిములు పెరగడమే దుర్వాసనకు కారణమవుతాయి. కొన్ని వేపాకులు లేదా టొమాటో రసాన్ని చెమట ఎక్కువగా పోసే చోట రాసి, పది నిమిషాలయ్యాక కడిగేయండి. రోజూ చేస్తే ఫలితం మీకే తెలుస్తుంది.
* పచ్చి బంగాళాదుంప ముక్కను తీసుకుని బాహుమూలల్లో పది నిమిషాలు రుద్దండి. ఆపై చల్లటి నీటితో కడిగేస్తే సరి. పేస్ట్‌లా చేసి పెట్టినా ఫలితముంటుంది. అలాగే చెమట ఎక్కువగా పోసేవారు నిమ్మ, ఆపిల్ సిడార్ వెనిగర్, బేకింగ్ సోడా వంటివి చర్మానికి పూయకపోవడం మేలు.
* అలోవెరాలో యాంటీ మైక్రోబియల్ గుణాలెక్కువ. అలోవెరా జెల్లో ముంచిన కాటన్‌తో బాహుమూలలను శుభ్రం చేసుకోండి. చెడు వాసనను దూరం చేయడమే కాదు.. అలర్జీల నుంచీ రక్షణ పొందొచ్చు.
* శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో నీటిది ప్రధాన పాత్ర. తక్కువ నీరు తీసుకోవడం వల్ల అవి శరీరంలోనే ఉండిపోయి దుర్వాసనకు కారణమవుతాయి. కనీసం రెండున్నర లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి. గ్లాసు నీటిలో చెంచా మెంతులు రాత్రంతా నానబెట్టి, రోజూ తాగినా ప్రయోజనం ఉంటుంది.
* ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యమివ్వాలి. నూనెపదార్థాలు, కారం శరీరంలో ఆసిడ్లకు కారణమవుతాయి. దీంతో చెమట పెరుగుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉండేవి బాగా తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!