Published : 25/06/2022 00:34 IST

గుడ్డుతో మచ్చలు మాయం...

ముఖంపై మచ్చలు, ఎండవల్ల కమిలి నలుపుగా మారిన ప్రాంతాన్ని మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావచ్చు. ఇందుకోసం కొన్ని టిష్యూపేపర్లు, కోడిగుడ్డు ఉంటే చాలు.

కోడిగుడ్డులోని తెల్లసొనను ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ముఖాన్ని మురికి లేకుండా శుభ్రం చేసి మెత్తని వస్త్రంతో తుడవాలి. తెల్లసొనలో బ్రష్‌ ముంచి దాన్ని ముఖంపై లేపనంలా రాసి, కంటిభాగం తప్ప, మిగతా అంతటినీ కప్పేలా టిష్యూపేపరును అతికించాలి. ఈ పేపరుపై మరోసారి తెల్లసొనను లేపనంలా రాసి పైన ఇంకో పేపరు అతికించి లేపనం వేయాలి. ఇలా మూడు వరుసలుగా పేపరుని అతికిస్తూ లేపనం వేసిన తర్వాత 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత సున్నితంగా కాగితపు వరుసలను పైవరకు తొలగిస్తే చాలు. ముఖచర్మం కాంతులీనుతుంది.

మెరిసే మెడ కోసం..

చేతి మోచిప్పలు, మెడ చుట్టూ, ముంజేతులపై నలుపుదనాన్ని పోగొట్టాలంటే కోడిగుడ్డు తెల్లసొనలో అరచెంచా తేనె, చెంచా నిమ్మరసం, రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలపాలి. ముందుగా నలుపుదనం ఉన్న చోట ఈ మిశ్రమాన్ని రాసి పైన టిష్యూ పేపరును అతికించాలి. పూర్తిగా అతికినట్లుగా అయిన తర్వాత మరోసారి ఈ మిశ్రమాన్ని అద్ది బాగా ఆరనిచ్చి, కాగితాన్ని తొలగించాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు ఇలా చేస్తే నలుపుదనం దూరమవుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని