వ్యర్థాలతో అందానికి అనర్థం...
రవళికి అకస్మాత్తుగా ముఖంపై మొటిమలు మొదలయ్యాయి. చర్మమంతా పొడారింది. ఆకలి తగ్గింది. ఇవన్నీ జీవక్రియల వేగం తగ్గిందని చెప్పే సంకేతాలు అంటున్నారు నిపుణులు. ఈ సమస్య హార్మోన్ల అసమతుల్యతకూ
రవళికి అకస్మాత్తుగా ముఖంపై మొటిమలు మొదలయ్యాయి. చర్మమంతా పొడారింది. ఆకలి తగ్గింది. ఇవన్నీ జీవక్రియల వేగం తగ్గిందని చెప్పే సంకేతాలు అంటున్నారు నిపుణులు. ఈ సమస్య హార్మోన్ల అసమతుల్యతకూ కారణమవుతుందని, అనర్థాలుగా మారే శరీరంలోని ఈ వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపితేనే అందం, ఆరోగ్యమని చెబుతున్నారు.
తరచూ అతిగా తినడం, వేపుళ్లకు ప్రాముఖ్యతనివ్వడంతోపాటు నీటిని తక్కువగా తీసుకోవడంవల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఎక్కువసార్లు కాఫీ, టీ తాగడం, పగటిపూట నిద్రపోవడం, అతి చల్లని, ఉడికించని ఆహారాన్ని తీసుకోవడం వంటివి ఈ సమస్యను దరిచేస్తాయి. ఆహారాన్ని బాగా నమిలి తినకపోతే జీర్ణవ్యవస్థ సామర్థ్యం తగ్గుతుంది. దీంతో వ్యర్థాలు బయటకు వెళ్లకుండా శరీరంలో పేరుకుపోతాయి. ఇవి చర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అధికబరువుకు కారణమవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ముందుగా ప్రాసెస్డ్ ఫుడ్, నూనెపదార్థాలకు దూరంగా ఉండాలి. రోజుకి ఏడెనిమిది గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం అలవరుచుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, చర్మాన్ని తేమగా మారుస్తుంది.
వంటలో.. మసాలా దినుసులను నువ్వులనూనెలో దోరగా వేయించిన తర్వాతే వంటలో వినియోగించాలి. కూరగాయలు, పప్పుదినుసులు లేదా ఆకుకూరలు బాగా ఉడికిన తర్వాతే మిగతా వంట దినుసులు వేయడం మంచిది. పసుపు, ధనియాలపొడి, అల్లం వంటివి వంటల్లో విరివిగా వాడటంవల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది. ఉదయం, సాయంత్రం తాజా పండ్లకు ప్రాధాన్యతనివ్వాలి. అలాగే అతిచల్లని నీరు జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తిని బలహీనం చేసి జీర్ణశక్తిని తగ్గిస్తుంది. అలాకాకుండా గోరువెచ్చని నీటికి, అప్పటికప్పుడు వండిన వేడి పదార్థాలకు ప్రాధాన్యతనిస్తే శరీరంలో వ్యర్థాలు పేరుకోకుండా ఉంటాయి. ప్రతిరోజు అరగంటసేపు చేసే నడక, వ్యాయామంతో శరీరంలోని వ్యర్థాలు చెమట రూపంలో పోతాయి. కంటినిండా నిద్ర జీవక్రియలను సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఆహారవిధానాలతోపాటు జీవనశైలిలో ఈ తరహా మార్పులు చేసుకుంటే నిండైన ఆరోగ్యం సొంతమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!