ఎత్తు చెప్పులైతే..
అర్చన ఎక్కువగా ఎత్తు చెప్పులు ధరించడానికే ఇష్టపడుతుంది. కానీ ఈమధ్య తనకు కలుగుతున్న అనారోగ్యాలకు ఈ చెప్పులే కారణమా అనే సందేహం మొదలైందామెకు. ఇది వాస్తవమే అంటున్నారు నిపుణులు. ఎత్తుచెప్పుల వినియోగం దీర్ఘకాల అనారోగ్యాలకు దారి తీస్తుందని సూచిస్తున్నారు.
అర్చన ఎక్కువగా ఎత్తు చెప్పులు ధరించడానికే ఇష్టపడుతుంది. కానీ ఈమధ్య తనకు కలుగుతున్న అనారోగ్యాలకు ఈ చెప్పులే కారణమా అనే సందేహం మొదలైందామెకు. ఇది వాస్తవమే అంటున్నారు నిపుణులు. ఎత్తుచెప్పుల వినియోగం దీర్ఘకాల అనారోగ్యాలకు దారి తీస్తుందని సూచిస్తున్నారు.
పాశ్చాత్య, సంప్రదాయ దుస్తులు రెండింటిపైనా ఎత్తు చెప్పుల వినియోగం పెరగడంతో చాలామంది పలురకాల అనారోగ్యాల బారిన పడుతున్నట్లు ఓ అధ్యయనం పేర్కొంది. ఈమేరకు, వారమంతా లేదా మూడు నాలుగుసార్లు ఎత్తైన పాదరక్షలు వినియోగిస్తున్న వారు దీర్ఘకాల అనారోగ్యాలకు గురైనట్లు గుర్తించారు. ఈ అధ్యయనంలో ఎంపిక చేసిన మహిళల్లో కొందరు ఫ్లాట్ షూ ధరించగా, వీరితో పోలిస్తే ఎత్తు చెప్పులు వేసుకున్నవారిలోనే అనారోగ్యాలు కనిపించాయి. రెండు అంగుళాలకన్నా ఎత్తుగా ఉన్న చెప్పులు ధరించిన వారి శరీరాకృతిలో కొంతకాలానికి మార్పు వచ్చినట్లు తెలిసింది. ఈ ఎత్తుచెప్పులు కలిగించే ఒత్తిడి వల్ల కండరాలు బిగుతుగా కావడమే కాకుండా శరీర ఆకృతిలోనూ మార్పు తెస్తుందని అధ్యయనంలో తేలింది. నడుం కింద శరీర అంతర్భాగాలన్నింటిలో నొప్పికీ కారణమయ్యాయట.
పరిష్కారం..
వారానికి ఒకటీ రెండుసార్లు మాత్రమే హైహీల్స్ ధరిస్తూ, మిగతా రోజుల్లో ఫ్లాట్‌వి వినియోగిస్తే చెడు ప్రభావం తక్కువగా ఉంటుంది. బూట్లు అలవాటున్న వారు ఎక్కువ సార్లు వాటి జోలికి పోకుండా బదులుగా ఫ్లాట్‌గా, మెత్తగా ఉన్నవి ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. నిత్యం వ్యాయామం, ఈత వంటివి అలవరుచుకుంటే మోకాళ్లు, హిప్స్, తొడలపై ఎత్తుచెప్పుల వల్ల కలిగే ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు. కీళ్లపై చెడు ప్రభావం ఉండదు. వీటిని ధరించే ముందు, తీసిన తర్వాత కాళ్లను జాడిస్తే కండరాలపై ప్రభావం తగ్గుతుంది. పాదానికి, షూకి మధ్యలో పల్చని కుషన్ ఉంచితే ఒత్తిడి ప్రభావం అంతగా ఉండదు.
ఎంపిక ..
హైహీల్స్ ఎంపిక చేసే ముందు వాటిని ధరించి నడిచి చూసి సౌకర్యంగా ఉన్నాయో లేదో గుర్తించాలి. సరైన సైజునే ఎంచుకోవాలి. పాదాల ఆకారాన్ని బట్టి బూట్ల ఎంపిక ఉండాలి. వెడల్పైన పాదాలున్న వారు పూర్తిగా మూసినట్లు కాకుండా పాదం పైభాగాన ఓపెన్‌గా ఉండాలి. చిన్నపాదాలున్న వారికి పూర్తిగా మూసివేసినట్లుండేవి సరిపోతాయి. కాలివేళ్లు పొడవుగా ఉన్న వారికి ముందుభాగాన పొడవుగా ఉన్న బూట్ల జోలికి వెళ్లకూడదు. వీటితో వేళ్లకు ఇరుకుగా, బిగుతుగా అనిపించి అసౌకర్యంగా అనిపిస్తుంది. హైహీల్స్ ధరిస్తే, కూర్చుని ఉన్నప్పుడు వీలైనప్పుడల్లా బూట్ల నుంచి పాదాలను బయటకు తీసి ఉంచాలి. ఇలా మధ్యలో ఇచ్చే విరామంతో ఒత్తిడి ప్రభావం తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.