మోనోక్రోమ్‌ మేకప్‌ తెలుసా?

వేడుకలొచ్చాయంటే హంగామా అంతా మనదే! మరి ప్రత్యేకంగా కనిపించాలనుకోవడం సహజమే కదా. చాలామందికి కొట్టొచ్చినట్టుగా కనిపించే మేకప్‌ నచ్చదు. అలాంటివాళ్ల కోసమే వచ్చిందీ మోనోక్రోమ్‌ మేకప్‌. తారలూ అనుసరిస్తున్న దీని గురించి మీరూ తెలుసుకోండి.

Updated : 05 Sep 2022 02:52 IST

వేడుకలొచ్చాయంటే హంగామా అంతా మనదే! మరి ప్రత్యేకంగా కనిపించాలనుకోవడం సహజమే కదా. చాలామందికి కొట్టొచ్చినట్టుగా కనిపించే మేకప్‌ నచ్చదు. అలాంటివాళ్ల కోసమే వచ్చిందీ మోనోక్రోమ్‌ మేకప్‌. తారలూ అనుసరిస్తున్న దీని గురించి మీరూ తెలుసుకోండి.

సాధారణంగా దుస్తులు, మేకప్‌ ఆధారంగా ఐ, లిప్‌ మేకప్‌ ఆధారపడి ఉంటుంది కదా! మోనోక్రోమ్‌ విధానంలో ముఖం, కళ్లు, పెదాలకు ఒకే రంగు ఉపయోగిస్తారు. ఒకరకంగా చేేసినా సహజ లుక్‌ ఇవ్వడం దీని ప్రత్యేకత. దీనిలోనూ రకాలున్నాయి.
* పింక్‌.. ఫౌండేషన్‌, కన్సీలర్‌ రాశాక లేత గులాబీ రంగు లిప్‌స్టిక్‌ వేసేయండి. బుగ్గలకు లేత గులాబీ బ్లష్‌ అద్ది, అదే రంగులో ఐ మేకప్‌నీ వేస్తే సరి. క్యూట్‌ లుక్‌ వచ్చేస్తుంది.

* న్యూడ్‌.. వేడుక, సీజన్‌లతో సంబంధం లేకుండా అన్ని సందర్భాలకూ, వేళలకీ సరిపోతుంది. ఏ దుస్తులకైనా నప్పుతుంది. బేసిక్‌ ఐషాడోకి బ్రౌన్‌ షిమ్మర్‌ కలపండి. దీన్ని కనురెప్పలపై అద్ది, ఐలైనర్‌, మస్కారా వేస్తే సరి. ముఖానికి క్రీమీ ఫౌండేషన్‌ను మాయిశ్చరైజర్‌తో కలిపి రాయొచ్చు. బీబీ క్రీమ్‌ రాసినా సరిపోతుంది. న్యూడ్‌ కలర్‌ లిప్‌స్టిక్‌, దాన్నే బుగ్గలపై బ్లష్‌లా రాస్తే లుక్‌ పూర్తవుతుంది.

* కోరల్‌.. కాస్త ప్రత్యేకంగా కనిపించాలనుకున్నప్పుడు దీన్ని ఎంచుకోవచ్చు. ఫౌండేషన్‌, కన్సీలర్‌ రాశాక కోరల్‌ రంగు ఐషాడోని కళ్లకు రాయాలి. లేదనిపిస్తే ఆ రంగు బ్లష్‌నైనా పూయొచ్చు. పైన కాస్త లిప్‌గ్లాస్‌ను అద్దితే కళ్లకు ప్రత్యేక మెరుపు వస్తుంది. పెదాలకు నారింజ రంగు క్రీమీ మ్యాటే లిప్‌స్టిక్‌ రాస్తే లుక్‌ పూర్తయినట్లే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని