పరిమళించేలా..

దుస్తులు, అలంకరణ, మేకప్‌తోపాటు పరిమళద్రవ్యాన్ని స్ప్రే చేసుకొన్న తర్వాతే బయటకు అడుగుపెట్టడం చాలామందికి అలవాటు.

Published : 12 Oct 2022 00:33 IST

దుస్తులు, అలంకరణ, మేకప్‌తోపాటు పరిమళద్రవ్యాన్ని స్ప్రే చేసుకొన్న తర్వాతే బయటకు అడుగుపెట్టడం చాలామందికి అలవాటు. శరీరంలో ఏయే చోట్ల స్ప్రే చేసుకోవాలి.. ఆ వివరాలను నిపుణులు చెప్పుకొస్తున్నారిలా...

పరిమళద్రవ్యాన్ని ముంజేతి సమీపంలోని పల్స్‌ పాయింట్‌ వద్ద, మోచేతి కింద, చెవులకు వెనుకవైపు, మోచిప్పల వెనుకవైపు స్ప్రే చేసుకోవాలి. శరీరం నుంచి వచ్చే అదనపు వేడి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి సెంటును శరీరానికంతటికీ ఆ పరిమళాన్ని వ్యాప్తిచెందడానికి ఆ వేడి ఉపయోగపడుతుంది. స్ప్రే చేసిన వెంటనే అక్కడ చేతితో రుద్ద కూడదు. ఇలాచేస్తే శరీరచర్మంలోకి పెర్‌ఫ్యూం తాలూకు నూనెలు ఇంకకముందే ఆవిరైపోతాయి. దీంతో వృథా అవుతుంది. పరిమళం అతి తక్కువ సమయంలోనే దూరమవుతుంది. స్ప్రేచేసిన కాసేపు ఆ ప్రాంతాన్ని తాకకుండా ఉంటే, చర్మంపై ఉండే సహజసిద్ధమైన నూనెలతో పరిమళద్రవ్యం కలిసి, రోజంతా ఆ పరిమళం ఉంటుంది. అంతేకాదు, మేకప్‌ పూర్తయిన తర్వాత కాకుండా స్నానం చేసిన వెంటనే చర్మరంధ్రాలు తెరుచుకొని ఉంటాయి. శరీరానికి వేడి ఉంటుంది. అప్పుడే పరిమళద్రవ్యాన్ని స్ప్రే చేస్తే శరీరానికంతటికీ ఆ పరిమళం వ్యాపించి రోజంతా అంటిపెట్టుకొని ఉంటుంది.

వెలుతురులో వద్దు..

పరిమళద్రవ్యాలను ఎండ, వెలుతురుపడే ప్రాంతాల్లో భద్రపరచకూడదు. స్నానాలగదిలో వచ్చే వేడినీటి ఆవిరి, వేడి, వాతావరణం మారుతున్న చోట్ల కూడా వీటిని ఉంచకూడదు. సహజపరిమళాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. చల్లని, చీకటిగా, పొడిగా ఉండే ప్రాంతాల్లో.. అంటే వార్డ్‌రోబ్‌లో ఉంచడం మంచిది. ఇలా భద్రపరిస్తే ఎక్కువరోజులు వాసన దూరమవదు. అలాగే దుస్తులకు, ఒంటికంతటికీ ఎక్కువగా స్ప్రే చేసుకోకూడదు. మీకే కాకుండా చుట్టుపక్కలవారికీ హాయిగా అనిపించేలా పరిమళద్రవ్యాలను వినియోగించాలి. ఒంటికి కొన్ని ప్రాంతాల్లోనూ, ఆ తర్వాత దుస్తులపై పడీపడకుండా అన్నట్లుగా పైనుంచి కిందకు ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. కోటు లేదా బ్లేజర్‌ ధరించినప్పుడు లైనింగ్‌కు లైట్‌గా వేస్తే చాలు. రోజంతా ఆ పరిమళం వెన్నంటే ఉంటూ మనసును ఉత్సాహంగా మారుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్