ఎత్తు చెప్పులతో నడిచేటప్పుడు...

కాస్త ట్రెండీగా కనిపించడానికి ఎత్తు చెప్పులు కొంటాం. కానీ వాటిని వేసుకున్నప్పుడు సరిగ్గా నడవ లేకపోతే ఇబ్బందే. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే అందంగా కనిపించడంతో పాటూ ఆత్మవిశ్వాసమూ ఇనుమడిస్తుంది.

Published : 13 Oct 2022 00:23 IST

కాస్త ట్రెండీగా కనిపించడానికి ఎత్తు చెప్పులు కొంటాం. కానీ వాటిని వేసుకున్నప్పుడు సరిగ్గా నడవ లేకపోతే ఇబ్బందే. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే అందంగా కనిపించడంతో పాటూ ఆత్మవిశ్వాసమూ ఇనుమడిస్తుంది.

* ఎత్తుచెప్పుల్ని మొదటి సారి వాడుతుంటే... పాయింటెడ్‌ హీల్‌ రకాల్ని కాకుండా వెడ్జెస్‌ తరహావి ఎంచుకోవాలి. అప్పుడు క్రమంగా అలవాటు పడతారు.

* హీల్స్‌ వేసుకున్నప్పుడు బరువంతా మడమ భాగంలో పడుతుంది. దానివల్ల మోకాలూ, మడమల నొప్పి ఇబ్బంది పెడతాయి. ఆ పరిస్థితి రాకుండా షూ ఇన్సర్ట్స్‌ లేదంటే ఫుట్‌ ప్యాడ్స్‌ వాడండి. వాటితో పాదాలు జారకుండా కూడా ఉంటాయి.

* కొత్తలో ఎత్తు చెప్పులతో నడుస్తుంటే జారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కింది వైపు శాండ్‌పేపర్‌తో కానీ, నెయిల్‌ ఫైల్‌తో కానీ రాసి చూడండి. దానివల్ల పట్టు ఏర్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్