Published : 13/10/2022 00:23 IST

ఆకర్షణీయమైన కళ్లకు...అలంకరణ!

అందంగా కనిపించడానికి ముఖానికి వేసుకునే మేకప్‌ ఒక ఎత్తయితే, కళ్లను అందంగా తీర్చిదిద్దగలగడం మరో ఎత్తు. ఈసారి ఈ మేకప్‌ మెలకువలు ప్రయత్నించి చూడండి... మీ పని సులువుగా పూర్తవుతుంది. అవేంటంటే...

* కళ్లను అందంగా కనిపించేలా చేయాలంటే... ముందు కనుబొమల తీరు చక్కగా ఉండాలి. మీ ముఖాకృతికి తగ్గట్లు వాటిని కత్తిరించుకుంటే...కళ్లను విశాలంగా కనిపించేలా చేస్తాయి.

* మేకప్‌కి ముందు... మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా రాయాలి. ఆపైన ప్రైమర్‌ వాడటం అస్సలు మరిచిపోవద్దు. కళ్లకింద కన్సీలర్‌ వాడితే...ఎక్కడైనా నల్లటి వలయాలు ఉన్నా చర్మ రంగులో కలిసిపోతాయి. అలంకరణ చేయడం సులువవుతుంది.

* కంటి చుట్టూ న్యూడ్‌ కలర్‌ బేస్‌ రాసి, వేసుకున్న దుస్తుల రంగుని బట్టి కంటి పై భాగంలో రెండు మూడు రంగుల షేడ్స్‌ని రెప్పలకు వాడొచ్చు. కనుబొమల కింది చర్మంపై లేతరంగు మేకప్‌ని వేసి ఐలైనర్‌ గీస్తే... కళ్లు, పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

* కనురెప్పలు పలుచగా ఉంటే ఫాల్స్‌ ఐలాషెస్‌ వాడొచ్చు. అవి వాడటం ఇష్టం లేకపోతే మస్కారా రాసి కర్లింగ్‌ చేసినా బాగుంటాయి. అయితే, మస్కారాని ఒకేసారి దట్టంగా రాయొద్దు. రెండు విడతలుగా రాస్తే...సరైన ఆకృతిలో కనిపిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని