ఈ మాస్కు వెరీ గుడ్డు..

చర్మం మెరిసిపోవాలి.. మొటిమలు మాయమవ్వాలి.. ముడతలు, వృద్ధాప్య ఛాయలు దరిచేరొద్దు.. కోరికేదైనా  గుడ్డును ప్రయత్నించేయండి. కొన్ని పదార్థాలతో కలిపి వేసే మాస్క్‌లు చర్మతీరుతో సంబంధం లేకుండా అందాన్ని పెంచేస్తాయి.

Published : 14 Oct 2022 00:58 IST

చర్మం మెరిసిపోవాలి.. మొటిమలు మాయమవ్వాలి.. ముడతలు, వృద్ధాప్య ఛాయలు దరిచేరొద్దు.. కోరికేదైనా  గుడ్డును ప్రయత్నించేయండి. కొన్ని పదార్థాలతో కలిపి వేసే మాస్క్‌లు చర్మతీరుతో సంబంధం లేకుండా అందాన్ని పెంచేస్తాయి.

* తెల్లసొనకు అరస్పూను చొప్పున తేనె, నిమ్మరసం కలిపి బాగా గిలకొట్టాలి. దీన్ని ముఖానికి పట్టించేయండి. ఆరాక కడిగేస్తే సరి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే యాక్నే దూరమవడమే కాదు.. దాని మచ్చలూ తగ్గుముఖం పడతాయి.

* తెల్లసొనకు అరస్పూను పసుపు, టేబుల్‌ స్పూను నారింజ రసం కలిపి ముఖానికి, మెడకు పట్టించండి. ఆరాక కడిగేసి, మాయిశ్చరైజర్‌ రాస్తే సరి. వారానికి రెండుసార్లు రాస్తే పిగ్మెంటేషన్‌, శరీరఛాయలో అసమానతలు, నల్లటి మచ్చలకు చెక్‌ పెట్టేయొచ్చు.

* ముఖం మెరిసిపోవాలంటే ఎగ్‌, అవకాడో మాస్క్‌ తప్పని సరి. తెల్లసొనకు స్పూను పెరుగు, బాగా పండిన అవకాడో గుజ్జు కలిపి ముఖానికీ, మెడకి రాయండి. 20 నిమిషాలాగి కడిగేస్తే సరి. గుడ్డులోని ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి పోషణని... అవకాడో సహజ తేమని ఇస్తాయి. ఎండ వేడిమికి కమలడం, నల్లబడటం వంటి సమస్యలూ ఈ ప్యాక్‌తో దూరమవుతాయి. యాంటీ ఏజింగ్‌గానూ సాయపడుతుంది.

* ముఖంపై ముడతలు, గీతలు వంటివి కనిపిస్తోంటే.. తెల్లసొనకి టేబుల్‌ స్పూను చొప్పున ఆముదం, కలబంద గుజ్జు కలిపి రాయండి. పావు గంట తర్వాత కడిగేస్తే సరి. ఇలా వారానికి మూడు సార్లు రాస్తే.. చర్మంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరగడంలో సాయపడుతుంది. ముఖాన్ని మృదువుగానూ మారుస్తుంది.

* ఏ ప్యాక్‌ ఎంచుకున్నా.. ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆరేంత వరకూ ఉంచుకోవాలి. ఇది వేసుకున్నంత సేపూ మాట్లాడకుండా ఉండాలి. కడిగేటప్పుడూ నెమ్మదిగా తడిచేసుకుంటూ రుద్దండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్