పండగనాడు మెరిసిపోదామా?

పండగంతా మనచుట్టూనే. మరి మెరిసిపోవాలిగా! ఎంత మేకప్‌ చేసినా సహజంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండటం తప్పనిసరి. కోరుకున్న లుక్‌ దక్కాలంటే.. ముందుగానే సిద్ధం చేసేయండి మరి!  చర్మం తాజాగా ఉంటే.. మేకప్‌ లేకుండానే ముఖం మెరిసిపోతుంది. మృత కణాలు ముఖాన్ని నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి....

Published : 22 Oct 2022 01:08 IST

పండగంతా మనచుట్టూనే. మరి మెరిసిపోవాలిగా! ఎంత మేకప్‌ చేసినా సహజంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండటం తప్పనిసరి. కోరుకున్న లుక్‌ దక్కాలంటే.. ముందుగానే సిద్ధం చేసేయండి మరి!

చర్మం తాజాగా ఉంటే.. మేకప్‌ లేకుండానే ముఖం మెరిసిపోతుంది. మృత కణాలు ముఖాన్ని నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. ముందు చర్మతత్వానికి తగిన స్క్రబ్‌ను ఉపయోగించండి. ఆపై తప్పక మాయిశ్చరైజింగ్‌ చేయాలి. స్కిన్‌కేర్‌ రొటీన్‌కి హైడ్రేటింగ్‌ సీరమ్‌నీ జత చేసి చూడండి. చర్మానికి తాజాదనం వస్తుంది.

ముఖం మెరవాలంటే మాస్క్‌ వేయాల్సిందే. షీట్‌ మాస్క్‌ లేదా ఫేస్‌ ప్యాక్‌.. మీ చర్మానికి తగినది ఎంచుకుంటే సరి. హైడ్రేటింగ్‌ స్లీప్‌ మాస్క్‌లు మాయ చేస్తాయి. కళ్లను మాత్రం మర్చిపోవద్దు. ఐమాస్క్‌ వేసుకోవచ్చు. లేదూ బంగాళా దుంపను సన్నగా కోసి కళ్లమీద పెట్టుకోవడమో, గులాబీ నీటిలో ముంచిన వస్త్రాన్ని లేదా దూదిని ఉంచడమో చేయండి. కళ్లు తాజాగా కనిపిస్తాయి.

పావుకప్పు కాఫీ పొడికి మూడు చెంచాల పంచదార, స్పూను చొప్పున ఆలివ్‌, విటమిన్‌ ఇ నూనె కలిపి, చేతులు, మెడ, కాళ్లకు పట్టించి, వృత్తాకారంలో మృదువుగా రుద్దండి. పావు గంటయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే మృతకణాలు తొలగి, చర్మమూ మెరుస్తుంది.

కొబ్బరినూనె, ఆముదం సమపాళ్లలో తీసుకొని వేడి చేసి తలకు పట్టించండి. కొద్దిసేపు మర్దనా చేస్తే మాడుకు బాగా రక్తప్రసరణ జరిగి, విశ్రాంతినివ్వడమే కాదు.. మరుసటిరోజు తలస్నానం చేస్తే వెంట్రుకలూ మెరుస్తాయి. రసాయనాల్లేని షాంపూ, షనర్‌లనే వాడాలి. కురులను సహజంగా ఆరబెట్టడానికే ప్రాధాన్యం ఇవ్వండి. హెయిర్‌ స్టైలింగ్‌ కోసమని హీటింగ్‌ టూల్స్‌ వాడకపోతే జుట్టు మెరుస్తుంది.

మానిక్యూర్‌, పెడిక్యూర్‌కి సమయం లేదా? గోరువెచ్చని నీటిలో మైల్డ్‌ క్లెన్సర్‌ని కలిపి 15 నిమిషాలు చేతుల్ని ఆ మిశ్రమంలో ఉంచాలి. బ్రష్‌తో వేళ్లు, గోళ్లను రుద్దితే చాలు. నిమ్మచెక్క మీద కొద్దిగా వెనిగర్‌ చల్లి దాంతో పాదాలను 5 నిమిషాలు రుద్ది, ఆరాక కడిగిస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్