ఉసిరితో ఊరించే అందం!

ఈ కాలంలో ఉసిరి కాయలు ఎక్కువ దొరుకుతాయి. ఇందులో విటమిన్‌ సితో పాటూ, ఇతర యాంటీఆక్సిడెంట్లూ...మరెన్నో పోషకాలూ పుష్కలంగా దొరుకుతాయి. అందుకే ఉసిరి ఆరోగ్యానికే కాదు... అందానికీ రక్షగా నిలుస్తోంది. అదెలాగో తెలుసుకుందామా!....

Published : 26 Oct 2022 00:16 IST

ఈ కాలంలో ఉసిరి కాయలు ఎక్కువ దొరుకుతాయి. ఇందులో విటమిన్‌ సితో పాటూ, ఇతర యాంటీఆక్సిడెంట్లూ...మరెన్నో పోషకాలూ పుష్కలంగా దొరుకుతాయి. అందుకే ఉసిరి ఆరోగ్యానికే కాదు... అందానికీ రక్షగా నిలుస్తోంది. అదెలాగో తెలుసుకుందామా!

కాలుష్యం, పోషకాల లేమి...వంటి కారణాలతో కొందరి ముఖంపై చిన్న వయసులోనే ముడతలు వచ్చేస్తాయి. ఇలాంటివారు టేబుల్‌ స్పూన్‌ ఉసిరి పొడిలో చెంచా పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా కనీసం రెండు మూడురోజులకోసారి చేస్తుంటే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి.

ఎండ, దుమ్ము ధూళి కారణంగా చర్మంపై టాన్‌ పడుతుంది. నిర్జీవంగానూ మారుతుంది. ఇలాంటప్పుడు ఉసిరి రసంలో కాస్త తేనె కలిపి ముఖానికి రాసి పదినిమిషాలాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రంచేసుకోవాలి. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ గ్రంథుల్ని శుభ్రపరుస్తాయి.

మొటిమలతో బాధపడుతున్నవారు ఉసిరిపొడిలో చెంచా పెసరపిండి, చెంచా నిమ్మరసం, కాసిని పాలు కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకోసారి చేస్తుంటే మొటిమల సమస్య దూరమవుతుంది.

మాడు పొడిబారడం, చుండ్రు సమస్యలున్నాయా? ఉసిరిపొడి మజ్జిగలో నానబెట్టి దానికి కోడి గుడ్డు తెల్లసొన, చెంచా బాదం నూనె జత చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంటాగి కఠిన రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేస్తే సరి. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా మారుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్