ముఖం కాంతిమంతం..

చర్మం మెరుస్తూ ఉండటంతో పాటు ముడతలు, ముఖంపై గీతలు మాయం కావాలంటే కొల్లాజెన్‌ తయారీని పెంచుకోవడమే సరైన చికిత్స అంటున్నారు నిపుణులు.

Published : 29 Oct 2022 01:11 IST

చర్మం మెరుస్తూ ఉండటంతో పాటు ముడతలు, ముఖంపై గీతలు మాయం కావాలంటే కొల్లాజెన్‌ తయారీని పెంచుకోవడమే సరైన చికిత్స అంటున్నారు నిపుణులు.

శరీరానికి తగినంత నీటిని అందించకపోతే డీహైడ్రేషన్‌కు గురై, ఆ ప్రభావం ముఖచర్మంపై పడుతుంది. దీంతో చర్మంలోని కొల్లాజెన్‌ బాండ్స్‌ తెగిపోయి ముఖంపై ముడతలు పెరుగుతాయి. నాలుగైదు చెంచాల పచ్చి పాలల్లో 20 వేరుశనగ గింజలు, చెంచా తెల్లనువ్వులు వేసి ఓ గంట నాననిచ్చి మిక్సీలో వేసి పేస్టులా చేసి పాలను వడకట్టాలి. ఒక గిన్నెలో ఈ పాలకు పెద్దచెంచా శనగపిండి, ఒకటిన్నర చెంచా తేనె వేసి బాగా కలిపి పావుగంట నాననిచ్చి ముఖానికి, మెడకు పట్టించి, 20 నిమిషాలు ఆరనివ్వాలి. గోరువెచ్చని నీటితో మృదువుగా మసాజ్‌ చేస్తూ ముఖాన్ని శుభ్రపరిస్తే చాలు. ఆ తర్వాత 24 గంటల వరకు సబ్బు, క్లెన్సర్‌తో ముఖాన్ని కడగకూడదు. పచ్చిపాలు చర్మానికి మృదుత్వాన్ని అందిస్తే, శనగపిండి మృతకణాలను దూరం చేస్తుంది.
తేనె చర్మానికి మెరుపుని, తేమని ఇస్తుంది. వేరుశనగ, నువ్వుల నుంచి పోషకాలు ముఖచర్మకణాలకు అంది కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడి, ముఖాన్ని మృదువుగా, మెరుపులీనేలా మారుస్తాయి.

కాఫీపొడితో..
ఒక బంగాళాదుంపను తురిమి రసాన్ని వడకట్టాలి. ఒక గిన్నెలో రెండు చెంచాల కాఫీ పొడిలో నాలుగుచెంచాల వేణ్ణీళ్లు పోసి బాగా కలిపి, ఇందులో బంగాళాదుంప రసం, రెండు చెంచాల బియ్యప్పిండి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో రెండు నిమిషాలు చిక్కగా అయ్యేలా ఉడికించి చల్లార్చాలి. దీన్ని పొడిగా ఉండే గాజుసీసాలో నింపి ఫ్రిజ్‌లో ఉంచితే రెండు వారాలు నిల్వ ఉంచుకోవచ్చు. ముఖాన్ని మురికిలేకుండా కడిగి, ఈ మిశ్రమాన్ని లేపనంలా పట్టించాలి. మెడ, చేతులకూ మృదువుగా రుద్దుతూ అప్లై చేయొచ్చు. పావు గంట ఆరనిచ్చి కడిగితే చాలు. వారానికి రెండు సార్లు ఈ మాస్క్‌ వేసుకుంటే, మృతకణాలు, చర్మంలోని బ్యాక్టీరియా దూరమవుతాయి. యాంటీ ఏజింగ్‌కీ ఉపయోగపడుతుంది. మచ్చలు, కంటి కింద నల్లని వలయాలు మాయమై, ముఖచర్మం కాంతులీనుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్