కోమలాంగికి కొత్తరకం బ్రాస్లెట్‌

కోమలమైన చేతులు కళకళలాడాలంటే ముంజేతిపై బ్రాస్లెట్‌ మెరవాల్సిందే. నిన్న మొన్నటివరకూ గాజులు వేసుకునో, కడియమో లేదా కనీ కనిపించనటు వంటి బ్రాస్లెట్‌ ధరించో మురిసిపోయేవారు అమ్మాయిలు.

Published : 07 Nov 2022 00:17 IST

కోమలమైన చేతులు కళకళలాడాలంటే ముంజేతిపై బ్రాస్లెట్‌ మెరవాల్సిందే. నిన్న మొన్నటివరకూ గాజులు వేసుకునో, కడియమో లేదా కనీ కనిపించనటు వంటి బ్రాస్లెట్‌ ధరించో మురిసిపోయేవారు అమ్మాయిలు. కానీ, కాలంతో పాటూ అభిరుచులూ మారతాయి కదా! అందుకే ఇప్పుడు వారు చేతికి పెట్టుకునే బ్రాస్లెట్‌ కూడా మెడలోని హారానికి తెచ్చినంత లుక్‌ తేవాలని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్లే పసిడి పూసలూ, ముత్యాలూ, పచ్చలూ, అచ్చబంగారంతో చేసిన గొలుసుల వరుసలతో రూపొందించిన నయా డిజైన్లు మార్కెట్‌ని ముంచెత్తు తున్నాయి. చూస్తే ఇవి మీ మనసునీ దోచేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్