కురులకు కోవాష్‌ చేస్తారా?

అందమైన, ఆరోగ్యకరమైన కురుల కోసం ఎన్నెన్నో చేస్తాం! నూనె, షాంపూ, కండిషనర్‌.. కుదిరినప్పుడల్లా హెయిర్‌ ప్యాక్‌లు. ఇన్ని చేసినా.. చాలామందికి అసంతృప్తే! మాటిమాటికీ షాంపూ చేస్తోంటే కురులేమో నిర్జీవంగా తయారవుతాయి.

Updated : 12 Nov 2022 04:15 IST

అందమైన, ఆరోగ్యకరమైన కురుల కోసం ఎన్నెన్నో చేస్తాం! నూనె, షాంపూ, కండిషనర్‌.. కుదిరినప్పుడల్లా హెయిర్‌ ప్యాక్‌లు. ఇన్ని చేసినా.. చాలామందికి అసంతృప్తే! మాటిమాటికీ షాంపూ చేస్తోంటే కురులేమో నిర్జీవంగా తయారవుతాయి. దీనికి పరిష్కారమే.. ‘కో వాష్‌’. తారలు మెచ్చుతోన్న ఈ విధానమేంటి?

* షాంపూ చేశాక కండిషనర్‌ రాయడం తెలుసు. కో వాషింగ్‌లో షాంపూ ఊసే ఉండదు. జుట్టు చిక్కుల్లేకుండా చేసి, నీటితో తడిపి, కుదుళ్ల నుంచి వెంట్రుక కొనల వరకు కండిషనర్‌ పట్టించాలి. అయిదు నిమిషాలు తలంతా మర్దనా చేసి, గోరు వెచ్చని లేదా చల్లటి నీటితో కడిగేయాలంతే! షాంపూ చేసినపుడు దానిలోని రసాయనాలు తల మీది నూనెగ్రంథులపై ప్రభావం చూపడమే కాదు వెంట్రుకలు పొడి బారేలానూ చేస్తాయి. కండిషనర్‌ తలను శుభ్రం చేయడమే కాదు సీబమ్‌ను కోల్పోకుండా చూస్తుంది. దీంతో జుట్టు పట్టుకుచ్చులా, మెరుస్తూ కనిపిస్తుంది.

* తేలికైన ప్రక్రియే కదూ! అయితే మీ కండిషనర్‌లో ఆల్కహాల్‌, సిలికాన్స్‌, సల్ఫేట్స్‌, పెట్రోలియం, మినరల్స్‌ లేకుండా చూసుకుంటేనే ప్రయోజనకరం. అలాగే కోవాషింగ్‌కి హెవీ ఆయిల్స్‌ లేనివి ఎంచుకోవాలి. దీన్ని అన్నిరకాల కురుల వాళ్లూ ప్రయత్నిస్తున్నా.. కర్లీ, సెన్సిటివ్‌ జుట్ట్లుకి ఎక్కువ అనుకూలం. త్వరగా జిడ్డుగా మారే వెంట్రుకలైతే దీన్ని ప్రయత్నించొద్దు.

* అయితే షాంపూ అవసరం ఇక లేదన్నమాట.. అనుకుంటున్నారా? మీరు పొరబడ్డట్టే! కండిషనర్‌ షాంపూకి పూర్తిగా ప్రత్యామ్నాయం కాదు. దాని వాడకాన్ని తగ్గించడమే. రోజూ ముఖాన్ని శుభ్రం చేస్తున్నా... స్క్రబ్‌ రూపంలో లోతైన శుభ్రం చేస్తుంటాం కదా! అలా షాంపూ లోతైన శుభ్రతకు తప్పనిసరి. ప్రతి రెండుసార్ల కోవాష్‌కు ఓసారి తప్పక షాంపూ చేసుకుంటే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్