నయన సోయగానికి కాఫీ క్రీం..

ముఖానికెన్ని క్రీంలు రాసినా, మేకప్‌ వేసినా కంటి కింద నల్లగా కనిపించే వలయాలు అందాన్ని తగ్గిస్తాయి.

Published : 25 Nov 2022 00:39 IST

ముఖానికెన్ని క్రీంలు రాసినా, మేకప్‌ వేసినా కంటి కింద నల్లగా కనిపించే వలయాలు అందాన్ని తగ్గిస్తాయి. వీటిని మటుమాయం చేయాలంటే కాఫీక్రీం మంచి మార్గం అంటున్నారు నిపుణులు.

యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న కాఫీ ఐ క్రీం కంటి కింది నల్లని వలయాలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. కళ్లకింద వాపు, పొడిబారడం వంటి సమస్యలకూ ఇది చెక్‌ పెడుతుంది. నిద్రలేమితో ఏర్పడే మచ్చలనూ తగ్గిస్తుంది. ఈ క్రీంని ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకోవచ్చు.

ఎలా అంటే..

మూడు చెంచాల కాఫీ పొడిని గిన్నెలోకి తీసుకొని దాంట్లో 120 ఎంఎల్‌ ఆలివ్‌నూనె కలపాలి. దాన్ని ఓ పావుగంట చిన్నమంట మీద వేడిచేసి, చల్లార్చి మృదువైన వస్త్రంతో వడకట్టాలి. మరో గిన్నెలో కోకోవా, షియా బటర్‌ చెంచా చొప్పున కలిపి డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో ఓ అరనిమిషం వేడిచేయాలి. వడకట్టి ఉంచిన కాఫీ ఆయిల్‌ చెంచా తీసుకొని అందులో అరచెంచా జోజోబా ఆయిల్‌, అయిదు చుక్కల లావెండర్‌ ఎసెన్షియల్‌ నూనె వేసి బాగా కలపాలి. ఇందులో వేడి చేసి ఉంచిన బటర్‌ మిశ్రమం, 2,3 చుక్కలు ‘ఈ విటమిన్‌’ ఆయిల్‌ వేసి కలిపితే కాఫీ క్రీం సిద్ధం. దీన్ని పొడి సీసాలో నింపి ఫ్రిజ్‌లో పెడితే రెండు వారాలకు పైగా నిల్వ ఉంటుంది. రాసుకునే ముందు కాసేపు బయట ఉంచితే సరిపోతుంది. ముందుగా ముఖాన్ని మేకప్‌, మురికి లేకుండా క్లెన్సింగ్‌ చేసి, ఆ తర్వాత ఈ కాఫీ క్రీంను కళ్ల కింద మృదువుగా రాసి ఆరనివ్వాలి. 20 నిమిషాలాగి కడిగేస్తే చాలు. రోజులో రెండుసార్లు చేస్తే క్రమేపీ మచ్చలు, వలయాలు దూరమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని