కళ్లకు మేకప్‌ వేస్తున్నారా?

సందర్భం చిన్నదైనా, పెద్దదైనా సరే... మేకప్‌ మాత్రం అదిరిపోవాలనుకునే అమ్మాయిల సంఖ్య ఎక్కువ.

Updated : 16 Dec 2022 01:14 IST

సందర్భం చిన్నదైనా, పెద్దదైనా సరే... మేకప్‌ మాత్రం అదిరిపోవాలనుకునే అమ్మాయిల సంఖ్య ఎక్కువ. అందుకే వీటిని విరివిగా వాడేస్తున్నారిప్పుడు. అయితే, కళ్లకు అలంకరణ చేసేప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలనీ హెచ్చరిస్తున్నారు మేకప్‌ నిపుణులు.

* కంటికి మేకప్‌ వేసుకుని అలానే నిద్రపోవద్దు. ఎందుకంటే అవి కళ్లల్లోకి వెళ్తే అలర్జీలు వస్తాయి. కచ్చితంగా పడుకునేముందు తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ఇందుకోసం ఆల్కహాల్‌ ఫ్రీ రిమూవర్‌ని వాడితే మేలు.

* కళ్లకు వాడే మేకప్‌ వస్తువులు హైపో అలెర్జినిక్‌ రకాలై ఉండేలా చూసుకోండి. లేదంటే వేలితో కొద్దిగా తీసుకుని చేతిమీదో, చెవి వెనుకో రాసి పరీక్షించండి. ఎందుకంటే వీటి తయారీలో ఉండే రంగులూ, పరిమళాలూ, ఇతరత్రా ప్రిజర్వేటివ్స్‌... మీ  కళ్లని ఇబ్బంది పెట్టొచ్చు.

* ఫంక్షన్‌లలో... ఒకే మేకప్‌ని ఇద్దరు ముగ్గురు వాడేస్తుంటారు. అలా చేయొద్దు. మేకప్‌ ఆర్టిస్ట్‌తో వేయించుకున్నా...కూడా ఇతరులతో అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే వీటిల్లో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఒకరినుంచి ఒకరికి పాకి...పరిణామం చెందే అవకాశమూ ఉంది. కొత్త సమస్యలు కొని తెచ్చుకోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్