అందాల పూబంతి!

బంతి రేకల్ని శుభ్రంగా కడిగి నీళ్లల్లో వేసి మరిగించాలి. దానికి కాస్త తేనె కలిపి అందులో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఇలా రోజూ బయటికి వెళ్లొచ్చాక, మేకప్‌కి ముందూ చేస్తుంటే... చర్మం శుభ్ర పడుతుంది.

Published : 25 Dec 2022 00:34 IST

* బంతి రేకల్ని శుభ్రంగా కడిగి నీళ్లల్లో వేసి మరిగించాలి. దానికి కాస్త తేనె కలిపి అందులో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఇలా రోజూ బయటికి వెళ్లొచ్చాక, మేకప్‌కి ముందూ చేస్తుంటే... చర్మం శుభ్ర పడుతుంది. ఈ మిశ్రమం మంచి టోనర్‌గానూ పనిచేస్తుంది.

* బంతి పూలను నీళ్లలో మరగనివ్వాలి. అవి కొద్దిగా అయ్యాక అందులో కాస్త గులాబీ నీరు, నిమ్మరసం చేర్చి ముఖం కడుక్కోండి. ఇది చర్మంపై టాన్‌ని తొలగిస్తుంది. నిర్జీవంగా మారిన చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది.

* బంతి పువ్వులో ఉండే గ్లైకో ప్రొటీన్‌, న్యూక్లియో ప్రొటీన్‌ అనే పదార్థాలు... చర్మ కణాల పునరుత్పత్తికి సాయం చేస్తాయి. ఇవి మొటిమల్నీ తగ్గిస్తాయి. పావు కప్పు బొప్పాయి గుజ్జులో రెండు చెంచాల బంతి పూల ముద్దని కలిపి... ముఖానికి రాయాలి. ఇలా వారానికోసారైనా చేస్తుంటే మేలు.

* జుట్టుకి తగిన పోషణ అందాలంటే! ఓ పది బంతిపూలను రేకలుగా విడదీసి,  ముద్దగా నూరి, రెండు చెంచాల కలబంద గుజ్జూ, కాస్త పెరుగూ కలిపి తలకు ప్యాక్‌లా వేయాలి. ఈ మిశ్రమాన్ని ఓ అరగంట ఉంచాక తక్కువ గాఢత ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి. జుట్టు నిగనిగలాడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్