ఎండకు ముసుగు వేద్దాం...

వేసవి కాలం వచ్చిందంటే చర్మాన్ని, కురులని కాపాడుకోడానికి పడని పాట్లు అంటూ ఉండవు. వేడికి జుట్టు నిర్జీవంగా మారుతుంది. చివర్లు చిట్లుతూ వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటాయి.

Published : 07 Feb 2023 00:25 IST

వేసవి కాలం వచ్చిందంటే చర్మాన్ని, కురులని కాపాడుకోడానికి పడని పాట్లు అంటూ ఉండవు. వేడికి జుట్టు నిర్జీవంగా మారుతుంది. చివర్లు చిట్లుతూ వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటాయి. అలా కాకూడదంటే నిపుణుల సూచనలేంటో చూసేద్దామా...

స్కార్ఫ్‌తో..  జుట్టుని ఎండ వేడి నుంచి కాపాడుకోవాలంటే.. నేరుగా ఆ కిరణాలు తలపై పడకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టోపీనో, స్కార్ఫ్‌నో ధరించటం తప్పనిసరి. వేసవి వేడి నుంచి వెంట్రుకలను రక్షించాలంటే జుట్టుని వదిలేయొద్దు. జడ వేసుకుంటేనే రక్షణ సాధ్యమవుతుంది.

ఎంపిక.. యూవీ కిరణాల నుంచి జుట్టుని సంరక్షించే ఉత్పత్తులను ఎంచుకోవాలి. మాయిశ్చరైజర్‌ ఉన్న మేలైన కండీషనర్‌లు, షాంపూల ఎంపిక మంచిది. రోజూ బయటకు వెళ్లాల్సి వస్తే వీలుని బట్టి వారానికి రెండు లేదా మూడు సార్లు నూనెతో మర్దన చేసి తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అవి వద్దు.. ఈ కాలంలో జుట్టును తడి ఆరబెట్టేందుకు హెయిర్‌ డ్రయ్యర్లు వాడకుండా ఉంటేనే సమస్యల నుంచి తప్పించుకోగలం. లేదంటే కురులు బాగా చిట్లిపోతాయి. స్ట్రైట్‌నర్ల వాడకాన్నీ వీలైనంత తగ్గిస్తే సరి.

వీటితో పూత.. మందార, మెంతి, ఉసిరి జుట్టు సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీలు చూసుకొని కనీసం వారానికి ఒకసారైనా వీటికి పెరుగు జోడించి తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. సహజ కండీషనర్‌లానూ పనిచేస్తాయి. జుట్టు పెరిగేందుకూ, చుండ్రు, శరీరంలోని వేడి తగ్గించేందుకూ ఈ లేపనాలు సాయపడతాయి. గుడ్డులోని తెల్లసొనతో తలకి పూత వేస్తే జుట్టుకి కావాల్సిన ప్రొటీన్లు, పోషకాలు అంది ఆరోగ్యంగా నిగారిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్