ఈ పొరపాట్లు చేస్తున్నారా?

ఆరోగ్యకరంగా మెరిసే చర్మం కోరుకోని అమ్మాయుంటుందా? ఎంత ఖర్చుపెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావడం లేదనే వాళ్లే ఎక్కువ.

Published : 10 Feb 2023 00:47 IST

ఆరోగ్యకరంగా మెరిసే చర్మం కోరుకోని అమ్మాయుంటుందా? ఎంత ఖర్చుపెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావడం లేదనే వాళ్లే ఎక్కువ. అయితే ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చెక్‌ చేసుకోమంటున్నారు నిపుణులు.

* బద్ధకంగా అనిపించో, అలసిపోయో.. బయటి నుంచి వచ్చాక ముఖం కడగడం మానేస్తున్నారా? మనం చిన్న విషయంగా తీసుకునే ఈ అంశమే చర్మానికి తీవ్ర హాని చేస్తుంది. మేకప్‌తోనూ పడుకోవద్దు. తర్వాతా రెండుసార్లు క్లెన్సింగ్‌ చేయడం తప్పనిసరి అలవాటు చేసుకోండి.

* సామాజిక మాధ్యమాల్లోకి వెళ్లామంటే చాలు. ‘దీన్ని వాడటం వల్ల మా చర్మం మెరిసిపోయిం’దంటూ బోలెడు ప్రకటనలు. ఆ ఆకర్షణలకు మోసపోవద్దు. స్నేహితుల సలహాలూ వద్దు. మీ చర్మతీరు, సమస్యలను సరిచూసుకొని ఆ తర్వాతే క్రీమ్‌లను ఎంచుకోండి.

* మృతకణాలు, బ్లాక్‌, వైట్‌ హెడ్స్‌ పోవాలంటే స్క్రబ్‌ చేయడం తప్పనిసరి. ఇది చర్మానికి లోతైన శుభ్రతనిస్తుంది. నిజమే! అయితే దీనికీ ఓ హద్దు ఉండాలి. వారానికి రెండుసార్లకు మించొద్దు. లేదంటే చర్మం లోపల దెబ్బతినడమే కాదు. చిన్న గాయాలు, పిగ్మెంటేషన్‌, మచ్చలకూ దారితీయగలదు.

* చలికి చర్మం పగులుతోందని తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌ రాస్తారందరు. మిగతా కాలాలకి వచ్చేసరికి పెద్దగా పట్టించుకోరు. ముఖం కడిగిన ప్రతిసారి చర్మతీరుకు తగ్గ మాయిశ్చరైజర్‌ తప్పక రాయాలి. ఎండలోకి వెళుతోంటే సన్‌స్క్రీన్‌ లోషన్‌నీ వాడటం మర్చిపోవద్దు. అప్పుడే వృద్ధాప్యఛాయలను అదుపు చేయడం సాధ్యం.

* రసాయనాలుండే సబ్బులకు బదులుగా ఫేస్‌వాష్‌లను వాడితే మేలు. వీటినీ చర్మతీరుకు తగ్గట్టుగానే ఎంచుకోవాలి. తీసుకునే ఆహారమూ చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యమివ్వండి. యాంటీ ఏజెనింగ్‌గా పనిచేస్తాయివి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్