శిరోజాలకు సూపర్‌ ఫుడ్స్‌..

ఒత్తైన జుట్టు ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. అందంలో భాగమైన శిరోజాలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇవి శిరోజాలకు సూపర్‌ఫుడ్స్‌లా పనిచేస్తాయని చెబుతున్నారు.

Published : 11 Feb 2023 00:14 IST

ఒత్తైన జుట్టు ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. అందంలో భాగమైన శిరోజాలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇవి శిరోజాలకు సూపర్‌ఫుడ్స్‌లా పనిచేస్తాయని చెబుతున్నారు.

చేపలు..  ప్రొటీన్లు, విటమిన్‌ డి, ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్‌ వంటివి ఇందులో ఉంటాయి. చుండ్రు దరిచేరకుండా మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మకణాలకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. దీంతో శిరోజాలు రాలేసమస్య దూరమై, ఒత్తుగా పెరుగుతాయి.

పప్పులు.. జింక్‌, మెగ్నీషియం పుష్కలంగా ఉండే పప్పు ధాన్యాలు శిరోజాలకు తగినంత పోషకాలను అందించడానికి దోహదపడతాయి. వీటిలోని బయోటిన్‌ జుట్టు పెరుగుదలకు ఉపయోగ పడుతుంది. అలాగే అల్పాహారంగా పాలు లేదా పెరుగు కలిపి ఓట్‌మీల్‌ను తీసుకుంటే చాలు. శిరోజాలకు కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటాయి.

బియ్యం.. బాస్మతి, బ్రౌన్‌, ఉప్పుడు బియ్యంలో విటమిన్‌ బి పుష్కలంగా ఉంటుంది. చర్మకణాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. దీనివల్ల జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. అలాగే గుడ్లు తీసుకోవడంతో వెంట్రుకలకు కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి. దీంతో జుట్టు రాలే సమస్యకు దూరంగా ఉండొచ్చు.

క్యారెట్‌.. కెరటిన్‌, ఏ విటమిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. వీటి ద్వారా కావాల్సినన్ని పోషకాలు చర్మానికి చేరి ఆరోగ్యంగా ఉంచుతాయి. మాడుపై చుండ్రు, దురద వంటి సమస్యలను పోగొట్టి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే ఓట్స్‌లోని బి విటమిన్‌, జింక్‌ పుష్కలంగా ఉండి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతోపాటు ఆకుకూరలను రోజూ ఆహారంలో చేర్చుకుంటే వీటిలోని ఏ,సీ విటమిన్లు సహా జింక్‌, మెగ్నీషియం, ఐరన్‌ వంటి ఖనిజ లవణాలు జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

పలు పోషకాలను.. ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ సహా ఏ,బీ,సీ,కే,ఈ విటమిన్లు మెండుగా ఉండే చిలగడదుంపలను ప్రతిరోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. అలాగే ఐరన్‌, జింక్‌, బి విటమిన్‌ ఉండే బటానీలను కూరలకు జత చేస్తే చాలు. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్