కోమలమైన చేతులకు షియా బటర్‌

వాతావరణం ఎలా ఉన్నా.. కొందరి చేతులూ, కాళ్లూ పొడిబారి, పగిలినట్లు కనిపిస్తుంటాయి. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే కాళ్లూ, చేతుల్ని కోమలంగా మార్చేయొచ్చు. ఆ చిట్కాలే ఇవి.

Published : 17 Feb 2023 00:25 IST

వాతావరణం ఎలా ఉన్నా.. కొందరి చేతులూ, కాళ్లూ పొడిబారి, పగిలినట్లు కనిపిస్తుంటాయి. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే కాళ్లూ, చేతుల్ని కోమలంగా మార్చేయొచ్చు. ఆ చిట్కాలే ఇవి.

* పాదాలు మృతకణాలతో నిర్జీవంగా కనిపిస్తుంటే... రోజూ రాత్రిళ్లు  కొబ్బరినూనె రాసుకుని మర్దన చేయాలి. ఉదయాన్నే కాస్త పంచదారతో  పాదాలను రుద్ది చివరగా ప్యూమిక్‌ స్టోన్‌తో మరోసారి స్క్రబ్‌ చేస్తే సరి. ఇలా రెండు రోజులకోసారి చేస్తుంటే క్రమంగా సమస్య దూరమవుతుంది. దీంతో పాటూ తరచూ చేతులకూ, పాదాలకూ మాయిశ్చరైజర్‌ రాసుకోవడం, పగుళ్లు తగ్గేవరకూ సాక్సులు వేసుకుని నడవడం వంటివి చేయాలి.

* రోజూ షియా బటర్‌ని చేతులూ, పాదాలకు రాసుకుని కనీసం పది నిమిషాల పాటు మర్దన చేస్తుంటే... చర్మం మృదువుగా మారుతుంది.

* పొడిబారే చర్మ సమస్యకి ఎప్సమ్‌ సాల్ట్‌ పరిష్కారం చూపిస్తుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఎప్సమ్‌ సాల్ట్‌ వేసుకుని అందులో కాళ్లూ లేదా చేతుల్ని ఉంచాలి. పదినిమిషాల తర్వాత ఇవతలకు తీసి కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ఆ భాగాలకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తేమ అందుతుంది.

* సగం నిమ్మచెక్కను తీసుకుని చక్కెరలో ముంచి తీయాలి. దీన్ని కాళ్లూ, చేతులకు రాసుకోవాలి. పొడిబారి, బరకగా మారిన చర్మం చాలా తక్కువ సమయంలోనే మృదువుగా తయారవుతుంది. అలాగే రాత్రిళ్లు నిద్రించే ముందు ఆలివ్‌నూనె రాసుకుని, మర్దన చేసుకున్నా సరిపోతుంది. ఇది చర్మాన్ని  కోమలంగా ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్