Published : 18/02/2023 00:13 IST

అలా మేకప్‌ చేయకూడదు!

మెరిసిపోవాల్సిన సందర్భమేదైనా కాస్త మేకప్‌ టచ్‌ ఇస్తుండటం మనకు అలవాటే! అయితే తెలియక చేసే చిన్న పొరపాట్లు చర్మ సమస్యలకు దారి తీయొచ్చని తెలుసా?

తెలియకో, సమయం లేదనో, ఒక్కరోజుకి ఏమవుతుందిలే అనో మాయిశ్చరైజర్‌ రాయడం మానేస్తున్నారా? సరైన లుక్‌ రాకపోవడమే కాదు చర్మంపై దురదలకూ కారణం అవుతుంది. హైడ్రేటింగ్‌ సీరమ్‌, మాయిశ్చరైజర్‌ రాశాకే మేకప్‌ జోలికి వెళ్లండి.

మేకప్‌ వేసేవారి వద్ద ఉండే పరికరాల్లో స్పాంజ్‌ ఒకటి కదూ! వాడిన ప్రతిసారి శుభ్రం చేయడం తప్పనిసరి. తరచూ వాడుతోంటే మూణ్నెళ్ల తర్వాత మార్చేయాలి.

బుగ్గలకు కెంపు రంగు అద్దకుండా మేకప్‌ పూర్తవదు కదా! కలిసొస్తుందని లిప్‌స్టిక్‌నే ఉపయోగిస్తారు చాలామంది. అదీ ప్రమాదమేనంటారు నిపుణులు. దానిలో ఉపయోగించే రసాయనాలే అందుకు కారణమట. కాబట్టి, సరైన చీక్‌ టింట్‌నే ఎంచుకోవాలి.

మేకప్‌ తొలగించడానికి నూనె లేదా నీటి ఆధారిత మేకప్‌ రిమూవర్‌లను ఎంచుకోండి. వైప్స్‌ చర్మాన్ని పొడిబారేలా చేయడంతోపాటు యాక్నేకీ దారి తీస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని