ఆత్మవిశ్వాసమే అందంగా!

నిత్యం ఆఫీసుకో, కాలేజీకో... వెళ్లేటప్పుడు మన దగ్గర ఎన్ని దుస్తులు ఉన్నా లేనట్లే అనిపిస్తుంది. ఇలాంటి భావన నుంచి బయటపడాలంటే... ఈ చిట్కాలు పాటించి చూడండి.

Published : 20 Feb 2023 00:09 IST

నిత్యం ఆఫీసుకో, కాలేజీకో... వెళ్లేటప్పుడు మన దగ్గర ఎన్ని దుస్తులు ఉన్నా లేనట్లే అనిపిస్తుంది. ఇలాంటి భావన నుంచి బయటపడాలంటే... ఈ చిట్కాలు పాటించి చూడండి.

* మీరెలాంటి దుస్తులు వేసుకుంటే ట్రెండీగా కనిపిస్తారన్న సంగతి కాసేపు పక్కన పెట్టండి. ముందు మీ ఒంటి తీరుకు తగ్గట్లు ఏవి సౌకర్యంగా నప్పుతాయో చూసుకోండి. ఇతరులు వేసుకున్నారనో, ఎదుటివారిలా కనిపించాలనో ప్రయత్నం చేయడం కంటే... మీకు సరిపోయేవి కడితేనే అందంగా కనిపిస్తారు.

* ఏ రోజుకారోజు కొత్తగా కనిపించాలంటే... దృష్టిపెట్టాల్సింది దుస్తులమీదే అయినా, కొత్తవి కొనమని కాదు. ఉన్నవాటినే రంగులూ, డిజైన్ల వారీగా విభజించి...మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వేసుకోవచ్చు. లేదంటే ఉన్నవాటిని రెండువారాల ప్రణాళికకు సరిపడా సర్ది పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అన్ని లేవనుకుంటే వారానికైనా ప్లాన్‌ చేసుకోవచ్చు. ఆ వరుస క్రమం తప్పకుండా వేసుకుంటే... ఒకసారి వాడిన డ్రెస్‌ని తిరిగి రెండువారాల తర్వాతే వేసుకోగలం. అప్పుడు అన్నీ పాతవే అన్న భావన రాదు.

* అందరికీ అన్నీ నప్పవు. మీ శరీరాకృతి, ఛాయ వంటివాటికనుగుణంగా మీకంటూ ఓ స్టైల్‌ స్టేట్‌మెంట్‌ అలవాటు చేసుకోండి. రంగుల్లోనో, డిజైన్లలోనో ప్రత్యేకతను చూపించండి. అప్పుడు మీరేం వేసినా ఇతరులకంటే భిన్నంగా కనిపిస్తారు. కొత్తరకాలు లేవన్న ఇబ్బందీ ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్