చర్మతత్వానికో లేపనం

సీజన్‌ మారు తున్నప్పుడల్లా చర్మం తీరు మారుతుంది. దానికి తగినట్లు వేసే లేపనాలు ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. అందుకు నిపుణులు చెబుతున్న ఈ ఫేస్‌ మాస్క్‌ల గురించి తెలుసుకుందాం..

Published : 20 Feb 2023 00:09 IST

సీజన్‌ మారు తున్నప్పుడల్లా చర్మం తీరు మారుతుంది. దానికి తగినట్లు వేసే లేపనాలు ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. అందుకు నిపుణులు చెబుతున్న ఈ ఫేస్‌ మాస్క్‌ల గురించి తెలుసుకుందాం..

పొడి చర్మానికి.. యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మెండుగా ఉండే తేనె పొడి చర్మానికి ఔషధంలా పనిచేస్తుంది. పేలవంగా మారిన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పొడిబారే చర్మ తత్వం ఉన్నప్పుడు తేనె చక్కటి ఉపశమనం అందిస్తుంది. పచ్చిపాలకు తేనె కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. చెంచా చొప్పున తేనే కలబంద టుపాలకు తేనె కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. చెంచా చొప్పున తేనె, కలబంద గుజ్జుకు రెండు చుక్కలు ఏదైనా ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి ముఖానికి పూత వేయాలి. పది నిమిషాలయ్యాక కడిగితే చాలు ఇది చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేసి మృదుత్వాన్ని అందిస్తుంది.
జిడ్డుకు దూరంగా... ముఖం తరచూ జిడ్డు కారుతుంటే... రెండు చెంచాల నీటిలో కొద్దిగా వంటసోడా కలిపి ముఖానికి రాయండి. పది నిమిషాలాగి చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఈ లేపనం చర్మ రంధ్రాల్లో మురికి, నూనెలను పోగొడుతుంది. అంతేకాదు నల్లని మచ్చలు, గీతలు కూడా దూరమవుతాయి.

రెండు రకాల చర్మతత్వం... కొన్నిసార్లు జిడ్డుగా, మరొకసారి పొడిబారినట్లుండే చర్మతత్వం కొందరిలో కనిపిస్తుంది.  ఇలాంటప్పుడు మేను కాంతిమంతంగా మారాలంటే.. ఒక గుడ్డు తెల్లసొనకు తేనె, చెంచా నారింజ రసం, పావుచెంచా పసుపు కలిపి ముఖం, మెడ, చేతులకు రాయాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేస్తే చాలు. ముఖ చర్మమంతా ఒకేలా మెరుపులీనుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్