మెరుపు తగ్గనీయొద్దు!

వేసవి మొదలైంది. వేడి ప్రభావానికి చర్మం మెరుపు కోల్పోతుందన్న బెంగ మనకి! దాని ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే! వేడితాపం నుంచి ఉపశమనానికి చల్లటి నీటితో స్నానం చేయాలనుంటుంది కదూ! అలా ఎంతసేపైనా గడిపేయొచ్చు అనీ అనిపిస్తుంది.

Published : 22 Feb 2023 00:12 IST

వేసవి మొదలైంది. వేడి ప్రభావానికి చర్మం మెరుపు కోల్పోతుందన్న బెంగ మనకి! దాని ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!

వేడితాపం నుంచి ఉపశమనానికి చల్లటి నీటితో స్నానం చేయాలనుంటుంది కదూ! అలా ఎంతసేపైనా గడిపేయొచ్చు అనీ అనిపిస్తుంది. కానీ అది చర్మానికి అంత మంచిది కాదు. తేమంతా కోల్పోయే ప్రమాదం. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయండి. త్వరగా ముగించాలి కూడా.

మిస్ట్‌లను తెచ్చేసుకోండి. స్నానమయ్యాక.. క్రీములు రాసే ముందు దీన్ని స్ప్రే చేసుకోండి. చర్మంలోని పీహెచ్‌ స్థాయులను సమన్వయం చేయడమే కాదు ముఖానికీ తాజాదనం ఇస్తుంది. అలసిపోయినట్టు అనిపించినా మేకప్‌ మీద దీన్ని చల్లుకున్నా ప్రయోజనం ఉంటుంది.

బయట అడుగు పెడుతోంటే సన్‌స్క్రీన్‌ ఎస్‌పీఎఫ్‌ 50ది రాసుకోవడం తప్పనిసరి. ఎక్కువసేపు ఎండలో గడపాల్సి వస్తే వెంట తీసుకెళ్లండి. ప్రతి రెండు గంటలకోసారి రాసుకుంటూ ఉంటే పిగ్మెంటేషన్‌ సమస్య ఉండదు.

సాయంత్రం వేళల్లో పసుపు, శనగపిండిని పాలతో కలిపి రాయడమో.. కలబందను ఐస్‌ట్రేలో గడ్డకట్టించి ముఖానికి రుద్దడమో చేయండి. ముఖం మెరుపు కోల్పోదు. యాక్నే సమస్యలున్న వారికీ ఉపశమనం.

యూవీ కిరణాలు మెరుపును తగ్గేలా చేయడమే కాదు చర్మం కమలడం, ట్యాన్‌, వృద్ధాప్య ఛాయలతోపాటు చర్మ క్యాన్సర్లకీ దారి తీస్తాయి. పొడవు చేతులున్న కాటన్‌ వస్త్రాలు, స్కార్ఫ్‌ లేదా టోపీ తప్పనిసరిగా ధరించండి. వీటితోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, ద్రవపదార్థాలు, పండ్ల రసాలకీ ప్రాధాన్యమిస్తే చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించినట్టే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్