మెంతులు మెరిపించగా...

తినగానే చేదనిపించినా... వంటకాలకు మహా రుచిని తెచ్చిపెడతాయి మెంతులు. వీటిల్లో ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలే కాదు అందాన్ని పెంచే గుణాలూ ఎక్కువే.

Published : 23 Feb 2023 00:05 IST

తినగానే చేదనిపించినా... వంటకాలకు మహా రుచిని తెచ్చిపెడతాయి మెంతులు. వీటిల్లో ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలే కాదు అందాన్ని పెంచే గుణాలూ ఎక్కువే. అవేంటంటే...

* జుట్టు కళావిహీనంగా కనిపిస్తుంటే... రాత్రి నానబెట్టిన మెంతుల్ని మెత్తగా చేసి దానిలో చెంచా చొప్పున కలబంద గుజ్జు, నిమ్మరసం చేర్చి తలకు ప్యాక్‌లా వేయండి. మెంతుల్లోని మాంసకృత్తులు కుదుళ్లకు పోషణనిచ్చి కేశాల్ని నిగనిగలాడేలా చేస్తాయి.

* జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మెంతులు ఎంతో ఉపకరిస్తాయి. రెండు చెంచాల నానబెట్టిన మెంతులూ, గుప్పెడు తాజా కరివేపాకును ముద్దలా చేసుకోవాలి. దీన్ని క్రమం తప్పకుండా జుట్టుకు పట్టించడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతాయి.

* వెంట్రుకల చివర్లు చిట్లకుండా, చుండ్రు బారిన పడకుండా ఉండాలంటే... మెంతులు నానబెట్టిన నీటితో జుట్టు తడిపి ఆపై నానబెట్టిన మెంతిపిండిలో కాస్త పెరుగు చేర్చి తలకు ప్యాక్‌ వేయాలి. వీటిల్లోని పొటాషియం జుట్టు తెల్లగా మారకుండా నిరోధిస్తుంది.

* పావుకప్పు మెంతుల్ని నానబెట్టి మొలకలు వచ్చేలా చేయాలి. ఆపై ఆరబెట్టి పొడి చేసి దాన్ని కొబ్బరి నూనెలో మరగనివ్వాలి. ఈ నూనెను తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.

* చుండ్రును నివారించడంలో మెంతులు సమర్థంగా పనిచేస్తాయి. గుప్పెడు మెంతులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ముద్దలా చేసుకోవాలి. దీనికి చెంచా నిమ్మరసం కలిపి పూతలా వేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్