Published : 27/02/2023 00:15 IST

మహారాణి మెరుపులు

పెళ్లిళ్లు,పూజలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో అందరి కంటే ప్రత్యేకంగా కనిపించాలని, మహారాణిలా వెలిగిపోవాలని ఉందా?! కానీ సాధ్యం కాదులెమ్మని సరిపెట్టుకుంటున్నారా? మరేం ఫరవాలేదు.. బ్రహ్మాండంగా కుదురుతుంది. అందుకు వేలూ లక్షలూ ఖర్చుపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ రాజస్థానీ హారాలు ధరిస్తే చాలు.. రాణిగారి దర్జా, దర్పం ఇట్టే వచ్చేస్తాయి. రంగురంగుల పూసలూ, రాళ్లు, ముత్యాలతో తయారయ్యే ఈ గొలుసులు స్వర్ణాభరణాలను మించి సొగసులు పోతున్నాయి. వేసుకున్న దుస్తులకు నప్పేలా భిన్న రంగుల్లో, విభిన్న ప్యాటర్న్స్‌లో రూపొందుతున్నాయి. హారాలకు తోడు చెవి దుద్దులూ జూకాలూ సెట్‌గానూ దొరుకుతాయి. భలే ఉన్నాయి కదూ! మీరూ కొన్నారంటే అప్సరసలా దీప్తులు వెదజల్లడం ఖాయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని